Makar Sankranti 2025 సంక్రాంతి వచ్చిందంటే ఊరూవాడా అంతా సందడే కనిపిస్తుంది. పండుగకు వారం పది రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాల్లో సందడి మొదలవుతుంది. పండుగ పూర్తయిన వారం తర్వాత వరకూ ఈ సందడి కొనసాగుతోంది. రైళ్లు, బస్సులు రద్దీగా కనిపిస్తాయి. ఊరూవాడా అంతా సమష్టిగా, సమైక్యంగా జరుపుకునే పెద్ద పండుగ. ఇక తెలుగు రాష్ట్రాలో ప్రజలేకాదు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు. విదేశాల్లో ఉంటున్న తెలుగువారు కూడా సంబురంగా చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఒక్కచోట చేరి వేడుకలు జరుపుకుంటారు. కెనడా, అమెరికా, యూకే, దుబాయ్, సింగపూర్, జపాన్‌తోపాటు వివిధ దేశాల్లోనూ సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. జనవని 11న కెనడాలో వేడుకలు నిర్వహించగా. తాజాగా జపాన్‌లో వేడుకలునిర్వహించారు.
తాజ్ ఆధ్వర్యంలో..
జపాన్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్(Telugu Association OF Japan) (తాజ్) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో వివిధ పోటీలు నిర్వహించారు. పెద్దలకు, పిల్లలకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు చిత్రలేఖనం(Drawing) పోటీలు నిర్వహించారు. పురుషుల కోసం కబడ్డీ(kabaddi), పతంగుల(Kite Festival) పోటీలు ఏర్పాటు చేశారు. ఇక మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పిల్లలకు కూఆ కైట్ ఫెస్టివల్‌తోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే తెలుగువారంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అందరూ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.
సంస్కృతిని మర్చిపోకుండా..
ఉద్యోగం, ఉపాధి రిత్యా వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేందుకు ఇలా వేడుకలు నిర్వహిస్తారు. సంస్కృతి, సంప్రాదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే జపాన్‌లోనూ వేడుకలు నిర్వహించారు. తెలుగువారి సమస్యల పరిష్కారానికి కూడా తాజ్ కృషి చేస్తోంది. ప్రశంసలు అందుకుంటోంది. పదేళ్లుగా సంక్రాంతి సంబురాలు నిర్వహిస్తోందని తాజ్ ప్రతినిధులు తెలిపారు. సంక్రాంతితోపాటు ప్రతీ తెలుగు పండుగను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.