Homeఆధ్యాత్మికంMaha Shivaratri 2026 Fasting: వీరు ఉపవాసం చేయకపోవడమే మంచిది.. ఎందుకంటే?

Maha Shivaratri 2026 Fasting: వీరు ఉపవాసం చేయకపోవడమే మంచిది.. ఎందుకంటే?

Maha Shivaratri 2026 Fasting: హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పరమశివుడు ఈరోజు ధ్యానంలో ఉండగా భక్తులంతా జాగారం చేస్తూ శివనామస్మరణం చేస్తుంటారు. ఈరోజు శివుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ అభిషేకం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటుందని అంటూ ఉంటారు. అయితే మహాశివరాత్రి రోజు చాలామంది నిరాహార ఉపవాసం చేస్తుంటారు. కేవలం పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటూ శివుడిని కొలుస్తూ ఉంటారు. అయితే మహాశివరాత్రి ఉపవాసం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ అన్ని శరీరాలకు ఇది అనుకూలం కాదని కొందరు వైద్యులు చెబుతున్నారు. భక్తి భావంతో చేసే ఉపవాసం ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవాలని అంటున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోవడమే మంచిదని అంటున్నారు.

మహాశివరాత్రి రోజు ఉండే ఉపవాసం కఠిన నియమాలతో ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. మరికొందరు స్వల్ప ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలాంటి ఉపవాసం చేయడం వల్ల తల తిరగడం, చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. గుండె జబ్బులు ఉన్నవారిలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి రక్త పోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది. గర్భిణీలు ఉపవాసం ఉండడం వల్ల తల్లితోపాటు శిశు ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే వైద్యులు సూచిస్తున్న ప్రకారం మధుమేహ రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఎప్పటికీ మెడిసిన్ వాడేవారు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉపవాసం విషయంలో ఆలోచించాలని అంటున్నారు. అయితే వీరు పూర్తిగా ఆహారం మానివేయడం కంటే సాత్విక ఆహారం తీసుకునే అవకాశం ఉంటే అలాంటి ఉపవాసం చేయవచ్చు.

కొందరు సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండాలని అనుకుంటారు. అయితే వీరు ఇలాంటి సమయంలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ వంటి వాటికంటే కొన్ని ప్రత్యేక పదార్థాలు తీసుకోవడం వల్ల ఎనర్జీతో పాటు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఆహార పదార్థాల్లో పాలు, పెరుగు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరినీరు, పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు. ఇవి శరీరానికి తగిన గ్లూకోస్, ఖనిజాలు, ద్రవాలు అందిస్తాయి. అయితే వీటిని తీసుకుంటూ సరైన నీటిని కూడా తీసుకుంటూ ఉండాలి. శరీరంలో నీరు తక్కువగా అయితే డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు మెడిసిన్ వాడేవారు కాళీ కడుపుతో ఉండకూడదు. కాళీ కడుపుతో మెడిసిన్ తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటివారు ఉపవాసం ఉండాలని అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular