Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 25న శనివారం ద్వాదశ రాశులపై అశ్వని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శనిదేవుడి అనుగ్రహం లభించనుంది. అలాగే 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?
మేషరాశి:
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. మరోవైపు ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువ.
వృషభం:
ఈ రాశివారు కుటుంబతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
మిథునం:
అనుకున్న పనులు రావడంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్లతో సంత్సంబంధాలు పెరుగుతాయి.
కర్కాటకం:
ఉద్యోగులు తమ పనులు చేయడంలో విజయం సాధిస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
సింహం:
ఉద్యోగులు ఈరోజు బిజీ వాతావరణంలో గడుపుతారు. సామాజిక కార్యక్రమాల కోసం సమయం కేటాయిస్తారు. అయితే ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి.
తుల:
ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే పరిష్కారం అవుతుంది. ఇతరులను ఎక్కువగా నమ్మొద్దు.
వృశ్చికం:
కటుుంబ సభ్యుల సహాయంతో సమస్యలు పరిష్కరిస్తారు. సాయంత్రం శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూల సమయం.
ధనస్సు:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మకరం:
పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. వివాహం చేసుకోవాలనుకునేవారికి సంబంధాలు రావొచ్చు.
కుంభం:
భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో తీర్థయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు వస్తాయి.
మీనం:
సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కొత్త పనులు చేపడితే విజయం సాధిస్తారు. అయితే ముందుగా పెద్దల సలహాలు తీసుకోవాలి.