Rythu Bandhu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎని‍్నకల సంఘం అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ ఇచ్చే న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పాత పథకమే కావడంతో రైతు బంధుసాయం పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్లుయింది. నవంబర్ 28వ తేదీలోపు మాత్రమే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయాలని నిబంధన విధించింది. దీంతో తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అడ్డంకులు తొలగినట్లయింది.
గులాబీ పార్టీకి గుడ్ న్యూస్..
రైతుబంధు డబ్బులు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రతే‍్యక కార్యదర్శితో నిధులు సిద్ధంగా చేయించింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి తప‍్పనిసరి అయింది. దీంతో ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ లేఖ రాశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది.
కాంగ్రెస్ ఫిర్యాదు..
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల సమయంలో రైతుబంధు డబ్బులు పంపిణీ చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. నవంబర్ చివరి వారంలో డబ్బులు విడుదల చేయకుండా చూడాలని కోరారు. ఎన్నిల వేళ పంపిణీ చేయడం వలన ఓటర్లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఆయుధంగా మలుచుకున్న కేసీఆర్..
కాంగ్రెస్ ఫిర్యాదును గులాబీ బాస్ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. రైతుబంధు ఆపేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ప్రతీ ఎన్నికల సభలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అనుబంధ వ్యవసాయ సంఘం నాయకులు తాము ఎని‍్నకల సమయంలో డబు‍్బలు పంపిణీని మాత్రమే అడ్డుకోవాలని ఈసీని కోరామని ఈసికి ఇచి‍్చన లేఖను విడుదల చేసింది. కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ప్రతీ సభలో, రోడ్‌షోలలో రైతుబంధులు కాంగ్రెస్ అడ్డుకుంటోందని అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతూనే ఉంది.
విడుదలకు అనుమతి..
ఈ క్రమంలో రైతుబంధు విడుదలకు ఎట్టకేలకు ఈసీ అనుమతి ఇచ్చింది. నాలుగు రోజుల్లోనే డబ్బులు జమ చేయాల్సి ఉండడంతో వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిధుల విడుదల ప్రారంభించింది. రైతుబంధు డబ్బులు విడుదల అవ్వడంతో తెలంగాణ రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రైతుబంధు నిధులు రావడంతో.. ఈ అంశంపై అధికార బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The central election commission has given permission for the release of rythu bandhu funds in the state
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com