Kailasanathar Temple: ఆధ్యాత్మికతకు పెట్టిన పేరు, నెలవు మన భారతదేశం. కొండకోనల్లో మాత్రమే కాదు ఎన్నో ప్రాంతాల్లో దేవుళ్లు, దేవతల ఆలయాలు కొలువయ్యాయి. రాష్ట్ర సంస్కృతిని కొన్ని ఆలయాలు ఎత్తి చూపిస్తుంటాయి. ప్రతి ఆలయానికి సొంత ప్రత్యేకత కూడా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశంలోనే చాలా దేవాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నిర్మాణ శైలి వల్ల దేశంలోనే కాదు కొన్ని ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి కూడా ఇక తమళనాడులోని కాంచీపురంలో కైలాసనాథర ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.
కాంచీపురం అంటే చీరలు ఎలా గుర్తు వస్తాయో.. హిందువుల పవిత్ర ప్రదేశం అని కూడా అదే విధంగా గుర్తు వస్తుంది. ఈ నగరానికి దేవలయాల నగరం అనే పేరు వచ్చింది. ఇక్కడ కైలాసనాథర్ ఆలయం శివునికి అంకితం చేశారు. ఇందులో శివుడు, దేవి, విష్ణువు, గణేషుడు, సూర్యుడు, కార్తికేయులు కొలువై ఉన్నారు. కాంచీపురంలోని ఈ దేవాలయాల్లో కాంచీపురం రత్నంగా పిలవబడే కైలాష నాథ్ గుడి కూడా ఉంది. ఇక ఈ గుడి ఏకంగా 1,300 సంవత్సరాల పురాతనమైనది. ఈ మందిరానికి చాలా ప్రత్యేకత ఉంది.
కాంచీపురానికి వచ్చే ప్రజలు కైలాసనాథ్ ఆలయ నిర్మాణాన్ని చూసి మంత్రముగ్దులు అవుతారు. ఇక ఈ ఆలయం వాస్తుశిల్పానికి ఒక మంచి ఉదాహరణగా పరిగణిస్తారు. ఈ మందిర ప్రత్యేకత ఇతర మందిరాలకంటే భిన్నంగా ఉంటుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని రాళ్ల ముక్కలను కలిపి నిర్మించారని చెబుతుంటారు. ప్రధాన ఆలయ సముదాయంలో 58 చిన్న ఆలయాలను కట్టడం ఈ ఆలయ పెద్ద విశేషం అంటారు.
ఆలయ ప్రవేశద్వారం వద్ద గోడపై 8 యాత్రా స్థలాలు ఉంటాయి. ఇందులో రెండు ప్రవేశ ద్వారాలు ఎడమ వైపున ఉంటే 6 కుడి వైపున ఉంటాయి. గర్భగుడిపై ద్రవిడ శిల్పకళలో ఒక విమానాన్ని కూడా నిర్మించారు. గర్భగుడిలో గ్రానైట్ తో చేసిన అద్భుతమైన, శివలింగాన్ని భారీగా ప్రతిష్టించారు. గర్భగుడి చుట్టూ గోడలపై ఊర్ద్వ తాండవ మూర్తి, శివ లింగోద్భవ, హరిహర వంటి రూపాలను చెక్కారు.