Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈ రెండు రాశుల వారికి ఏ రోజు అనుకోని అదృష్టం... అవేంటంటే?

Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఏ రోజు అనుకోని అదృష్టం… అవేంటంటే?

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశరాసులపై గురువారం అశ్వినీ నక్షత్ర ప్రభావం ఉండనుంది. అలాగే ఈరోజు సర్వార్ధ సిద్ధియోగం కలగనుంది. దీంతో తుల, మిథునం రాశులకు అన్నీ కలిసి రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం .

మేష రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. దీంతో నిరాశతో ఉంటారు. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.

వృషభ రాశి:
వివాహితులు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. లేకుంటే ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తుంది. వ్యాపారులు ప్రత్యర్ధుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు .

మిథున రాశి:
కొన్ని కారణాలవల్ల ఈ రాశి వారు మానసిక ఒత్తిడితో ఉంటారు. జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం.

కర్కాటక రాశి:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రియమైన వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో దూరం పెరుగుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు.

సింహారాశి:
ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. కొన్ని వాగ్దానాలను నెరవేర్చుతారు.

కన్య రాశి:
అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితంలో కొన్ని చిక్కులు ఏర్పడతాయి. ప్రియమైన వారిని బుజ్జగిస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

తుల రాశి:
ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇది అనుకూలమైన సమయం కాదు. అదనంగా ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు నేటితో పరిష్కారం అవుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు రాశి:
ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం కలుగుతుంది. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. మనసు నిరాశగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి:
ఏ పని చేపట్టిన ఏకాగ్రతను ఉంచాలి. లేకుంటే సమస్యలు ఎదుర్కొంటారు. మనసు కొంత విచారంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తో గొడవలు ఉండే అవకాశం. జీవిత భాగస్వామితో ఏకాంతంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి:
అనవసరంగా మాట్లాడడం మానుకోవాలి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.

మీనరాశి:
ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version