Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. గురువారం సిద్ధయోగం ఏర్పడనుంది. ఈ కారణంగా మీన రాశి వ్యాపారులకు అనుకోని ఆదాయం వస్తుంది. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విలాస వంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వీటి వల్ల లాభాలు ఉంటాయి.
వృషభ రాశి:
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. శత్రువుల్లో ఎవరైనా మీపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండడమే మంచిది. ఆదాయం తో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.
మిథున రాశి:
తల్లిదండ్రులకు ప్రత్యేకంగా బహుతులు అందిస్తారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి:
వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారికి అనుకోని ఆదాయం వస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. తండ్రితో వాగ్వాదం ఉండే అవకాశం. ఎక్కువగా వాదనలు చేకపోవడమే మంచిది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి.
సింహారాశి:
జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్లాన్లు వేస్తారు. ఉన్నత విద్య చదవాలనుకునేవారు తీవ్ర ప్రయత్నాలు చేరస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి:
జీవనోపాధి రంగంలోని వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళనను కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఆశీస్సులు పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు అన్వేషిస్తారు.
తుల రాశి:
వ్యక్తిగతంగా సంబంధాలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. తండ్రి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పెండింగు పనులు పూర్తి చేయడంలో తీవ్రంగా శ్రమిస్తారు. ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి.
వృశ్చిక రాశి:
మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో శుభవార్తలు వింటారు. విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసేవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు.
ధనస్సు రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వ్యాపార రంగాల్లోని వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో శత్రువులతో వాదనలు పెరుగుతాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పనిలో ఎక్కువ సమయం కేటాయించకుండా ఉల్లాసంగా గడుపుతారు.
మకర రాశి:
కష్ట సమయంలో కొందరి మద్దతు ఉంటుంది. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకునేవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సంబంధాలు మెరుగుపడుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఎక్కువగా వాదనలకు దిగొద్దు. లేకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు.
కుంభరాశి:
పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకునేవారికి కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
వ్యక్తిగత సంబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునేవారికి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు.