Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు అనుకోని ఆదాయం..

Horoscope Today: 2024 జూన్ 9 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కొన్ని రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Written By: Srinivas, Updated On : June 9, 2024 7:42 am

Horoscope

Follow us on

Horoscope Today: 2024 జూన్ 9 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కొన్ని రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరికొందరికి అనుకోని ఆదాయం పెరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. ఇచ్చిన పనిని సులభతరంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతారు.

వృషభ రాశి:
సాంప్రదాయ విలువలు పాటిస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. బయటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు.

మిథున రాశి:
వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలు బలపడుతాయి. కొందరు వ్యక్తుల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావొచ్చు. ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరిస్తారు.

సింహారాశి:
ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారులు కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవన ప్రమాణంలో మార్పులు ఉంటాయి. వాగ్దానాలను నెరవేరుస్తారు.

కన్య రాశి:
చట్టపరమైన విషయాలు అనుకూలంగా మారుతాయి. ఎక్కువగా వాదనలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు నుంచి శుభవార్తలు వింటారు.

తుల రాశి:
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళికలు వేస్తారు. అనవసరంగా వాదనలకు దిగొద్దు.

వృశ్చిక రాశి:
కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. చాలా రంగాల్లోపోటీ ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ వేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

ధనస్సు రాశి:
పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగులు ప్రమోషన్లపై శుభవార్త వింటారు. అన్ని రంగాల వారు ఉల్లాసంగా ఉంటారు. దీంతో ఆనందానికి అడ్డూ అదుపు ఉండదు.

మకర రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. తల్లిదండ్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలిలో మార్పులు వస్తాయి.

కుంభరాశి:
వ్యాపారంలో లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులనుంచి శుభవార్త వింటారు. ఉద్యోగులకు మంచి ఫలితాలు రానున్నాయి.

మీనరాశి:
ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు మంచి ఆదాయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశం. ఏ పని చేసినా శ్రద్ధ వహించాలి.