Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సయంలో గురుడు, శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) :
ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చూస్తే వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) :
ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అదనంగా ఖర్చులు పెరుగుతాయి. ఇంటికి సంబంధించిన పనుల్లో నిమగ్నమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర):
ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు అదనంగా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) :
ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా పని పెండింగ్ లో ఉంటే ఈరోజు పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) :
జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉన్నత విద్య చదువు కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. తండ్రి సలహాతో కొత్త పెట్టుబడులు పెడుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) :
కొన్ని పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. తల్లితో ఓ విషయంలో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) :
జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై ఆధిపత్యం కనసాగించాలనునకునేవారు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి గౌరవం పొందుతారు. కొన్ని బలహీనతలు అధిగమిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :
కొన్ని పనుల కోసం ఒత్తిడి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే జీవిత భాగస్వామితో చర్చించాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుకు ప్రారంభిస్తారు. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇదేమంచి సమయం. పెండింగులో ఉన్న అప్పులను తీరుస్తారు. రోజూ వారీ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. స్నేహితులతో కలిసి ఓ శుభకార్యక్రమానికి హాజరవుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) :
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ప్రజలకు మద్దతు ఉంటుంది. కొన్ని వైపుల నుంచి శుభవార్తలు వింటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :
ఇంట్లో వస్తువుల కోసం అదనంగా డబ్బుఖర్చు చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనిని వాయిదా వేయకూడదు. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే వెంటనే తీరుస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) :
ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అప్పులు చెల్లించడంలో విజయం సాధిస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుకోవాలి.