Horoscope Today: ఈ రాశివారికి ఈరోజు అనుకోని లాభాలు..

Horoscope Today: 2024 జూన్ 8 శనివారం రోజున ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు శని శష యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి.

Written By: Srinivas, Updated On : June 8, 2024 6:48 am

horoscope today

Follow us on

Horoscope Today: 2024 జూన్ 8 శనివారం రోజున ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు శని శష యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలతో బాధపడుతారు. కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి.

వృషభ రాశి:
ప్రభుత్వ పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందాలి. వ్యాపార సంబంధిత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

మిథున రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు ఉండొచ్చు. పెండింగు రుణాలను తిరిగి చెల్లిస్తారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు.

కర్కాటక రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.ప్రత్యర్థులు ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. ఇచ్చిన మాటను నెరవేర్చేలా ప్లాన్ చేయాలి.

సింహారాశి:
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

కన్య రాశి:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మససు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

తుల రాశి:
గృహ నిర్మాణాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు అనవసర ఒత్తిడిలకు లోనవుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి:
వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. విహార యాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి:
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు ఉంటాయి. కుటుంబంలోని కొందరు వ్యక్తుల పూర్తి మద్దతు ఉంటుంది. ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి.

మకర రాశి:
ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటాయి.

కుంభరాశి:
ఉద్యోగులకు ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మీనరాశి:
ప్రత్యర్థులను ఓడించడంలో ముందుంటారు. పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.