https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని లాభాలు.. అవేంటంటే?

పెడింగు పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడుపుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2024 / 08:02 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: ద్వాదశ రాశులపై ఈరోజు స్వాతి, విశాఖ నక్షత్రాల ప్రభావం ఉంటాయి.సోమవారం చంద్రుడు తుల రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు బ్రహ్మయోగం, శుక్లయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనూహ్యంగా శుభ ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు కష్టపడాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలం. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు టాస్క్ ను పూర్తి చేయడం వల్ల ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. దీంతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్త వింటారు.

    వృషభ రాశి:
    శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగాల్లోని వారు అనూహ్య విజయాలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు అధికారుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి.

    మిథున రాశి:
    పెడింగు పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడుపుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    కర్కాటక రాశి:
    జీవనోపాధి కోసం చూసేవారు శుభవార్త వింటారు. పెద్దలు చెప్పిన దానిని తూచ తప్పకుండా పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల్లో ఒకరికి సాయం చేస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలను పొందుతారు.

    సింహారాశి:
    ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ముఖ్యమైన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యారంగానికి చెందిన వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు.

    కన్య రాశి:
    ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రోజూవారీ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం.

    తుల రాశి:
    ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం వల్ల లాభాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. ఇంటికి సంబంధించిన పనులు వాయిదా వేయొద్దు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పిల్లల చదువుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతారు.

    ధనస్సు రాశి:
    ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల కోసం ఇతరులపై ఆధారపడుతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.

    మకర రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేముందు ఆరోగ్యం విషయం ఆలోచించాలి. సాయంత్రి ఎవరికీ వాగ్దానాలు చేయద్దు. జీవనోపాధి రంగంలోని వారు కొత్త అవకాశాలను పొందుతారు. ఎక్కువగా వాదనలకు దిగొద్దు.

    కుంభరాశి:
    ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విహార యాత్రలకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం వారికి ఒత్తిడి పెరుగుతుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    మీనరాశి:
    పిల్లల పెళ్లికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ కోసం డబ్బును పొదుపు చేస్తారు. వివిధ పథకాలలో పెట్టుబడులు పెడుతారు. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించేవారు శుభవార్తలు వింటారు.