Horoscope Today: సర్వార్ధ సిద్ధి యోగం ప్రభావంతో ఈ రెండు రాశుల వారికి ఈరోజు ఏ పని చేపట్టినా విజయమే…

వ్యాపారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయల్లో ప్రమోషన్ పొందే అవకాశం. పిల్లల భవిష్యత్తు పై శ్రద్ధ పెడతారు. తల్లిదండ్రులకు సేవ చేస్తారు. నాణ్యమైన ఆహారం తీసుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.

Written By: Chai Muchhata, Updated On : July 30, 2024 8:14 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. మంగళవారం ధ్రువ యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ప్రభావంతో తుల, సింహ రాశులకు ఏదంటే అది అవుతుంది. మరికొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..

మేష రాశి:
వ్యాపారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయల్లో ప్రమోషన్ పొందే అవకాశం. పిల్లల భవిష్యత్తు పై శ్రద్ధ పెడతారు. తల్లిదండ్రులకు సేవ చేస్తారు. నాణ్యమైన ఆహారం తీసుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. కోర్టు కేసులుంటే నేటితో పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని ప్రత్యేక సమస్యలపై ఇతరుల సలహా తీసుకుంటారు. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది.

మిథున రాశి:
కష్టపడి పనిచేసిన వారికి మంచి ఫలితం ఉంటుంది. కొన్ని విజయాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. బంధువులతో కొన్ని విషయాలపై విసృతంగా చర్చిస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి:
అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి గౌరవం పొందుతారు. కొన్ని రంగాల వారు విజయం పొందుతారు. విద్యార్థులకు కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహారాశి:
సంబంధాలు మెరుగుపడుతాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. సోమరితనాన్ని విడిచిపెట్టి పనులు చేయాలి. అప్పుడే అనుకున్న విజయం సాధిస్తారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.

కన్య రాశి:
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే అనుకున్న విజయం సాధిస్తారు. అనేక రంగాల వారు ప్రణాళికతో వ్యవహరిస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

తుల రాశి:
ఒత్తిడికి దూరంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం బారిన పడే అవకాశం. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంబంధాలు మెరుగుపడుతాయి.

వృశ్చిక రాశి:
వ్యక్తిగతంగా సమాజంలో గౌరవం పెరుగుతంది. వృత్తితో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఎవరితో ఎక్కువగా మాట్లాడద్దు. స్నేహితుల్లో ఒకరు మీతో వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంటారు. కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మకర రాశి:
కొన్ని రంగాల వారు ఆందోళనగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగతంగా సమాజంలో గుర్తింపు వస్తుంది. కొత్త ప్రాజెక్టు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీపై ఆధిపత్యానికి కొందరు ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి:
వ్యాపారులకు కొన్ని ఆఫర్లు వస్తాయి. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. జీవిత భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు. కుటుంబ సబ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.

మీనరాశి:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు.