Horoscope Today(7)
Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారం ద్వాదశ రాశులపై అర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈ రోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు అజ ఏకాదశి ఏర్పడనుంది. దీంతో కర్కాటకం, తుల సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి భవిష్యత్ లో లాభదాయకంగా ఉండనున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఏ పనిలోనైనా నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేకుంటే సమస్యలు వస్తాయి.
వృషభ రాశి:
ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో ఉంటారు. పై అధికారులతో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
మిథున రాశి:
కుటుంబ సభ్యులతో గొడవలు ఉండే అవకాశం. అందువల్ల కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తండ్రి సహాయం తో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి:
విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేస్తారు. సోదరుల సహకారంతో ఆస్తి వివాదాలు సమసిపోతాయి. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తుంటాయి.
సింహ రాశి:
ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. పిల్లలతో సహా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని రంగాల వారికి అన్నిటా విజయమే.
కన్య రాశి:
ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి. సాయంత్రం వ్యాపారులకు ఆకస్మిక లాభాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
తుల రాశి:
కొన్ని తప్పుల విషయంలో గుణపాఠం ఉంటుంది. స్నేహితుడికి సాయం చేయడానికి ముందుకు వస్తారు. వాహనాల కొనుగోలు కోసం డబ్బును ఆదా చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి.
వృశ్చిక రాశి:
ప్రభుత్వ పథకాలు వినియోగించుకుంటారు. నిరుత్సాహ పరిచే వారికి దూరంగా ఉండాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ప్రణాళికల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. రుణ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి:
పెండింగ్ లో ఉన్న డబ్బులు వసూలవుతాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. విద్యార్థులు భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు ఉంటాయి.
మకర రాశి:
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంటికి అతిథులు వస్తారు. ఉద్యోగులు సీనియర్ అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. సోదరుల సహాయంతో కుటుంబ సభ్యుల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతారుే.
మీనరాశి:
పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. ప్రయాణాల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల సమస్యలను పరిష్కరిస్తారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Horoscope today the effect of aja ekadashi on these two signs today they will get success in these works