https://oktelugu.com/

Naga Chaitanya : పెళ్లి తర్వాత నాగచైతన్య ఏం చేయబోతున్నారు?

అక్కినేని నాగార్జున ఇంట పెళ్ళి బాజాలు మోగాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 5న నాగచైతన్య శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేయడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 6, 2024 / 08:14 AM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya : అక్కినేని నాగార్జున ఇంట పెళ్ళి బాజాలు మోగాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 5న నాగచైతన్య శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేయడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ముందుగా సమంతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు చైతన్య. ఈ జంట మూడేళ్లు మాత్రమే కలుసి ఉన్నారు. ఆతరువాత మనస్పర్ధలు వచ్చాయి. దీంతో మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నారు ఈ దంపతులు. ఇక ఆ తరువాత చైతూ శోభితతో ప్రేమలో పడ్డారట. ఈ జంట ఈ రోజే ఒకటైంది.

    చాలా కాలం సీక్రేట్ గా ప్రేమించుకున్నారు అనే టాక్ ఉంది. ప్రేమించిన ఈ జంట పెద్దలను ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. అయితే నాగచైతన్య కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవడం లేదు. అందుకే మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు నాగచైతన్య. అందుకే అలాంటి సినిమా కోసం సిన్సియర్ గా పనిచేస్తున్నారు కూడా. చాలా కష్టపడ్డా కాని ఈ కుర్ర హీరోకి అదృష్టం కలిసి రావడం లేదు అనేది వాస్తవం.

    అందుకే మంచి ప్రాజెక్ట్ ల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చిన ప్రాజెక్ట్ లను వదలకుండా తన సత్తా చాటుతున్నాడు ఈ అక్కినేని వారసుడు. అందులో భాగంగానే చైతూ తండేల్ మూవీ చేస్తున్నారని టాక్. ఈ సినిమా కోసం ఏడాదికిపైగా కష్టపడుతున్నాడు చైతూ. గ్రౌంట్ రియాల్టీ తెలుసుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. చేపలు పట్టేవారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలిసుకోవడం కోసం వారితో కలిసి ఉన్నారు నాగచైతన్య. వారి దగ్గరకు వెళ్ళి వారి లైఫ్ స్టేన్ ను అలవాటు చేసుకున్నాడు ఈ హీరో.

    మరి ఈసినిమా అయినా చైతూను గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. అయితే తండేల్ సినిమాను సెట్స్ మీదికి తీసుకొని వచ్చారు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి కూడా భారీ సక్సెస్ రావాలని తెగ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికీ కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని సాధించారు ఈ డైరెక్టర్. అందుకే తండేల్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నారట చందూ మొండేటి.

    తండేల్ తో పాటు విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కార్తీక్ దండు. అందుకే ఈయన దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చైతూ. దాంతో పాటుగా మరో రెండు సినిమాలకు కూడా ఆయన ఒకే చెప్పారట. మొత్తం మీద మరోసారి హిట్ల వర్షం కురిపించాలని నాగచైతన్య గట్టిగానే కుస్తీ పడుతున్నాడు. మరి ఆయన కష్టం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో..

    మొత్తం మీద అక్కినేని వారసుడి పెళ్లితో ఆ ఫ్యామిలీ మొత్తం ఫుల్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సమయం తీసుకొని ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు చైతూ. మరి ఆయన అదృష్టం ఈ సారి ఎలా ఉందో చూడాలి.