Horoscope Today: 2024 జూన్ 1 శనివారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శనిదేవుడి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారికి ఈరోజు సంపద పెరుగుతుంది. కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.
వృషభ రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్థుల విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని విషయాల్లో మోసపోవచ్చు. జాగ్ర్తత్తగా ఉండాలి. కొన్ని తప్పులపై గుణపాఠం నేర్చుకుంటారు.
మిథున రాశి:
కొత్త పెట్టుబడులు పెడుతారు. సన్నిహితుల ద్వారా కొంత సమాచారం సేకరిస్తారు. ఇతరుల మాటలను ఎక్కువగా నమ్మొద్దు. వ్యాపార ప్రణాళికలు వేస్తారు.
కర్కాటక రాశి:
లక్ష్యం చేరుకునే దిశగా కష్టపడుతూ ఉంటారు. వీరికి శనిదేవుడి అండ ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా కోసం దారులు పడినట్లే. వ్యాపారులు బిజీగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
సింహారాశి:
సామర్థ్యానికి తగిన విధంగా డబ్బు అందుతుంది. ఈ కారణంగా సంతోషంగా ఉంటారు. ఓ పని నిమిత్తం బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు.
కన్య రాశి:
ఈ రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. ఈరోజు వీరికి శనీశ్వురుడి అనుగ్రహం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరులకు అప్పు ఇవ్వొద్దు.
తుల రాశి:
రుణాలు తీసుకోవడం తగ్గించాలి. ఉద్యోగులు బాధ్యతతో విధులు పూర్తి చేస్తారు. కొన్ని పొరపాట్ల కారణంగా మాటలు పడాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
వృశ్చిక రాశి:
పిల్లల భవిష్యత్ పై ఆందోళన చెందుతారు. కొన్ని పనుల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఓ శుభవార్త వింటారు.
ధనస్సు రాశి:
ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. చాలా విషయాల్లో ఓపిక అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఎక్కువ.
మకర రాశి:
ఆర్థిక లాభాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినోద కార్యక్రమాల్లో అపశృతి నెలకొనే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.
కుంభరాశి:
ఎవరితోనైనా ఎక్కువగా వాదనలు చేయొద్దు. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. స్నేహితుల నుంచి కొన్ని అవకాశాలు పొందుతారు. వ్యక్తిగత విషయాలపై దృష్టిని కేటాయించాలి.
మీనరాశి:
పనిభారం ఎక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మాటలు నమ్మొద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతారు.