https://oktelugu.com/

Horoscope Today : ఈ రాశుల వ్యాపారులపై శనిదేవుడి ప్రభావం.. వద్దన్నా లాభాలు..

ఖర్చులు పెరుగుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా వివాదాలు ఏర్పడితే వెనక్కి తగ్గడం మంచిది. బంధువులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేరస్తారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2024 / 08:16 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాల కదలిక వల్ల ఆయా రాశులపై ప్రభావం పడుతుంది. శనివారం ద్వాదశ రాశులపై అశ్లేష, మాఘ నక్షత్రాల ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో శని దేవుడికి ఇష్టమైన రోజు కనుగ.. కొన్ని రాశులపై శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మేషం నుంచి మీనం వరకు ఏ రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులకు పోటీ ఉండదు. దీంతో వారికి అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మధ్యాహ్నం వరకు కొన్ని పనులకు ఆటంకం ఏర్పడుతాయి. ఆ తరువాత మార్గం సుగమం అవుతాయి.

    వృషభ రాశి:
    ఉద్యోగులు కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్ కోసం వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    మిథున రాశి:
    ఉద్యోగులు కార్యాలయాల్లో చొరబాటు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

    కర్కాటక రాశి:
    వ్యాపారులు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదనంగా ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. అనవసర వివాదాల్లోకి దూరితే తీవ్ర నష్టం ఏర్పడుతుంది.

    సింహారాశి:
    ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొన్ని అవసరాల కోసం ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం కష్టపడుతారు.

    కన్య రాశి:
    ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. సాయంత్రం కొన్ని పనుల కోసం సమయాన్నివెచ్చిస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వ్యాపారంలో పెట్టుబడుల కోసం మూలధనం సేకరిస్తారు.

    తుల రాశి:
    ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలకు కొత్త అవకాశాలు వస్తాయి. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు పోటీ దారుల కంటే ఎక్కువ లాభం పొందుతారు.

    వృశ్చిక రాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొందరికి ఆటంకాలు ఎదురవుతాయి. ఏ పన చేపట్టినా ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు సమయం తీసుకోవడం మంచిది.

    ధనస్సు రాశి:
    ఖర్చులు పెరుగుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా వివాదాలు ఏర్పడితే వెనక్కి తగ్గడం మంచిది. బంధువులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేరస్తారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

    మకర రాశి:
    కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల కోరికలను నెరవేరుస్తారు. ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

    కుంభరాశి:
    మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను బహిరంగ పరచకుండా ఉండాలి.

    మీనరాశి:
    కొన్ని రహస్యాలు ఇతరులకు చెప్పొద్దు. ఈరోజు ఏ పని చేపట్టినా సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలసి ఉల్లాసంగా ఉంటారు.