Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు..

2024 మే 26 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 26, 2024 7:46 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 మే 26 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కర్కాటకం, కన్యరాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాల ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
వైవాహిక జీవితం బాగుంటుంది.కుటుం సభ్యుల సమస్యలు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితంలో ఓపిక అవసరం. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

వృషభ రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. దీంతో ఆదాయం పెరుగుతుంది.

మిథున రాశి:
మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఎవరినీ ఎక్కువగా నమ్మొద్దు. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి:
కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రముఖ వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.

సింహారాశి:
పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడుల విషయంలో తల్లిదండ్రుల సలహా తీసుకోవాలి. కొన్ని కొత్త ప్రణాళికల ద్వారా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.

కన్య రాశి:
స్నేహితులతో సరదాగా ఉంటారు. మార్కెట్లో గౌరవం పెరుగుతుంది. అనవసర వాదనలకు పోవద్దు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.

తుల రాశి:
ప్రియమై వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని సమస్యలు ఇతరులకు చెప్పుకోవడం వల్ల భారం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వాటిని నియంత్రించే ప్రయత్నం చేయాలి.

వృశ్చిక రాశి:
కొత్త ఆస్తిని పొందే అవకాశం. ముఖ్యమైన పనులు ఇతరులకు అప్పజెప్పొద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలను పెండింగులో ఉంచొద్దు.

ధనస్సు రాశి:
వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మద్దతు పెరుగుతుంది. రోజూవారీ అవసరాలకు ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మకర రాశి:
ఎవరికైనా మాట ఇస్తే దానిని నెరవేర్చాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల మద్దతు ఉంటుంది. బాధ్యతలను నెరవేరుస్తారు. పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు.

కుంభరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని చర్యల వల్ల ఇతరులు ఆశ్చర్యపోతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది.

మీనరాశి:
ఆరోగ్య సమస్యలపై ఆందోళన చెందుతారు. కొన్ని వాదనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు.