Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు..

2025 మే 9 గురువారం రోజున ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతోఓ రాశివారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

Written By: Chai Muchhata, Updated On : May 9, 2024 8:10 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2025 మే 9 గురువారం రోజున ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతోఓ రాశివారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి.

వృషభ రాశి:
ఎదుటి వారితో వాదనలకు దిగొద్దు. చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మిథునం:
ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి. కటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించకపోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి.

కర్కాటకం:
ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. మానసికంగా ధృఢంగా ఉండాలి. విద్యార్థులు భవిష్యత్ పై ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాలంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

సింహ:
శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. కొందరు బంధువులు ఇంటికి వస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య:
ఆహారం విషయంలో కేర్ తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు.

తుల:
కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. కొత్త అవకాశాలను వస్తాయి. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి. ఆదాయం పెరుగుతంది.

వృశ్చికం:
కొన్ని విషయాల్లో ఓపిక ఉండాలి. ఓ పనిలో విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతారు.

ధనస్సు:
సమాజంలో గౌరవం పెరుగుతంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. డబ్బుకొరత ఉంటుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు.

మకర:
లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఖర్చులు నియంత్రణలో ఉండాలి. ఆదాయం పెరుగుతంది.

కుంభం:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.

మీనం:
కొన్నిసమస్యలను పరిష్కరించుకుంటారు. తప్పుల నుంచి బయటపడుతారు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.