Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 7న ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. గురువారం చంద్రుడు మకర రాశిలో సంచరించనున్నాడు. దీంతో మిధున రాశివారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎదుటి వారికి ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి:
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆందోళన చెందుతారు. బయటి మాట్లాడేటప్పుడు తొందరపడొద్దు. కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకుంటారు.
మిధునం:
ఏదైనా పని చేసేటప్పుడు సంయమనంతో ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వ పథకాలపై శ్రద్ధ పెట్టడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
కర్కాటకం:
కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. వ్యాపారులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాలి. అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉండండి.
సింహ:
వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి. ఓ స్నేహితుడు మంచి సలహా ఇస్తారు. కొన్ని పనుల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి.
కన్య:
పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే వారికి వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలి.
తుల:
కొందరు వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అనేక ఆఫర్లు పొందుతారు. మనసులో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా ఉండాలి.
వృశ్చికం:
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉండేవారికి ప్రయోజనాలు ఉంటాయి. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు.
ధనస్సు:
ఉద్యోగులు కార్యాయాలయాల్లో తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బాధ్యతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వొచ్చు.
మకర:
మీపర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోకండి. కొందరు వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేయొచ్చు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం:
ఉద్యోగులు ఉల్లాసంగా కనిపిస్తారు. అనవసర వాదనలకు దిగొద్దు. సంతోషకరమైన వార్తలు వింటారు. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.