Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 28న ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. బుధవారం చంద్రుడు తులా రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారి వారు శక్తివంతంగా ఉంటారు. మరో రాశి వారికి ఖర్చలు అధికంగా ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశా వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి కావడానికి కష్టపడుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి:
ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మిధునం:
పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుతో చర్చించుకోవాలి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.
కర్కాటకం:
ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహ:
ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఏదైనా ఒక సమస్య ఉంటే దాని గురించి ఆందోళన చెందుతారు.
కన్య:
ఈ రాశివారు ఈ రోజు శక్తివంతంగా ఉంటారు. వ్యాపారులు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ముందు వెనకా ఆలోచించాలి. ఇతరులకు అప్పులు ఇవ్వడం మానుకోవాలి.
తుల:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం కోసం ఇతరుల సలహాలు అవసరం ఉంటాయి.
వృశ్చికం:
పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. పాత వ్యక్తులను కలుస్తారు. ఇంటికి అతిథులు రావొచ్చు. మార్కెటింగ్ లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి.
ధనస్సు:
స్నేహితుల్లో ఒకరికి సాయం చేస్తారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. డబ్బు పొదుపు విషయంలో ఆలోచిస్తారు. వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశం.
మకర:
గతంలో మొదలు పెట్టిన పనులుపూర్తి చేస్తారు. కొన్ని పనులు ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణం గడుపుతారు. ఉద్యోగులకు సీనియర్లతో ఇబ్బందులు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులకు కొన్ని వాగ్ధానాలు ఇస్తారు.
మీనం:
కుటుంబ విషయాల్లో సంయమనం పాటించాలి. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు.