Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 27న ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు కన్య రాశిలో సంచరించనున్నాడు. దీంతో మిధున రాశివారు కొన్ని విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
మీకున్న సమస్యలపై ఇతరుల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే కొన్నింటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
వృషభ రాశి:
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులు తోటి వారి నుంచి మద్దతు పొందుతారు. అప్పు తీసుకోవాలనుకునేవారికి మంచి సమయం.
మిధునం:
కొన్ని విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగం కోరుకునేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో ఆలోచించాలి.
కర్కాటకం:
సొంత పనుల కంటే ఇతరుల పనులపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది.
సింహ:
వివాహ ప్రయత్నాలు సాగుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాల్లో కొన్నింటికి పరిష్కారం లభిస్తుంది.
కన్య:
కొన్ని సమస్యలతో పోరాడుతుంటే అవి నేటితో పరిష్కారం అవుతాయి. ఏదైనా పని మొదలు పెట్టేముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి..
తుల:
దీర్ఘకాలిక ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు లాభాలు పొందే అవకాశం. ఉద్యోగులకు ఇన్ని రోజులు ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి.
వృశ్చికం:
మీ మాటలతో ప్రజలను సంతోష పెడుతారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తారు.
ధనస్సు:
పాత స్నేహితులను కలుస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలి. కొత్త బాధ్యతలను చేపడుతారు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
మకర:
ఈ రాశివారికి ఈరోజు అనుకూలం. ఏ పనినైనా తెలివిగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
కుంభం:
వ్యాపారులు కొత్త వ్యక్తులను భాగస్వామిగా చేర్చుకోకపోవడమే మంచిది. ఉద్యోగులు విధుల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. బంధువుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది.
మీనం:
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు చేపడుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.