Horoscope Today: ఈ రాశి వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..

2024 మే 15 బుధవారం రోజున ద్వాదశ రాశులపై మంగళ అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 15, 2024 8:30 am

horoscope of amavasya

Follow us on

Horoscope Today: 2024 మే 15 బుధవారం రోజున ద్వాదశ రాశులపై మంగళ అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో ఓ రాశి వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మరో రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది.

వృషభ రాశి:
ఉద్యోగులు ఈరోజు నుంచి కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి:
తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు అనుకోని విజయాలు సాధిస్తారు.

కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని కలలను నెరవేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ఏ పని చేసిన ఓపిక అవసరం.

సింహారాశి:
కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు.

కన్య రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త జీవితం ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి.

తుల రాశి:
ఈరోజంతా ఉల్లాసంగా ఉంటారు. ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. సమాచార రంగంలోని వారు శుభవార్తలు వింటారు. వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది.

వృశ్చిక రాశి:
నాణ్యమైన ఆహరం తీసుకునేందుకు ప్రయత్నించాలి. బంధువుల నుంచి శుభవార్త వింటాకరు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

ధనస్సు రాశి:
ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కెరీర్ పై ఫోకస్ చేస్తారు.

మకర రాశి:
అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

కుంభరాశి:
ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు కష్టాల నుంచి బయటపడుతారు. కొన్ని లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడం అవసరం.

మీనరాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.