Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు నాగపంచమి. ఈ నేపథ్యంలో నాలుగు రాశుల వారిపై నాగదేవత అనుగ్రహం ఉంటుంది. దీంతో వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరొకొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశిపై నాగపంచమి ప్రభావం ఉండనుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు రావొచ్చు. కుటుంబంలో కొత్త సమస్యలు వస్తాయి. వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ఈ రాశి వారిపై నాగదేవత అనుగ్రహం ఉంటుంది. ప్రియమైన వారితో చిక్కులు ఏర్పడుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. శత్రువులు మీపై ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం. అందువల్ల వారికి దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం వల్ల వ్యాపారులకు కలిసి వస్తుంది.
మిథున రాశి:
నాగదేవతల అనుగ్రహంంతో ఈ రాశి వారికి అనుకూల ప్రయోజనాలు ఉండనున్నాయి. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు నేటితో మీ దగ్గరికి వస్తుంది. ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడొద్దు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
కర్కాటక రాశి:
విదేశాల్లో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇవి లాభిస్తాయి. పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునేవారు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. గృహానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
సింహారాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాగపంచమి వేళ వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీ పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అలాంటి వారికి దూరంగా ఉండాలి.
కన్య రాశి:
కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదం నేటిత సమసిపోతుంది. ఉద్యోగులు కార్యాలయల్లో ప్రమోషన్ పొందే అవకాశం. విద్యార్థులు కెరర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
తుల రాశి:
వ్యాపారులు జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకుంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉపాధి పనులు చేసేవారు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. నాయకత్వ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల భవిష్యత్ పై ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల్లో చీలికలు వస్తాయి. సోదరులు, స్నేహితులు ఉంటే వ్యాపారులకు మద్దతు ఇస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతారు.ఉద్యోగులు కార్యాలయాల్లో బాధ్యతగా ఉంటారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి:
ప్రియమైన వారి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో ముందు వెనుకా ఆలోచించాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. పాత బాధ్యతల నుంచి విముక్తి చెందుతారు. ఇంటికి అవసరమైన కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
మకర రాశి:
న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటే అవి నేటితో పరిష్కారం అవుతాయి. బంధువులు డబ్బు ఇచ్చి ఆదుకుంటారు. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సమయం వెచ్చిస్తారు. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఇతరుల మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు.