https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు..

వ్యాపారులకు ఇబ్బంది పెట్టడానికి కొందరు శత్రువులు ప్రయత్నిస్తారు. అయితే కొత్త పరిచయాల విషయంలో జాగ్ర్తత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం తలెత్తితే వెంటనే పరిష్కరించుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 3, 2025 / 08:02 AM IST

    Horoscope Today(10)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు వజ్రయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వ్యాపారులు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల ఉద్యోగులు తమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : వ్యాపారులు కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం పొందుతారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన చిక్కుల్లో ఉంటే నేడు భయటపడుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులకు ఇబ్బంది పెట్టడానికి కొందరు శత్రువులు ప్రయత్నిస్తారు. అయితే కొత్త పరిచయాల విషయంలో జాగ్ర్తత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం తలెత్తితే వెంటనే పరిష్కరించుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు అనుకున్న రంగాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి కొన్నిశుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు అనుకూల సమయం.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఇష్టమైన వ్యక్తుల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. బలవంతంగా ఏ పని చేయడానికి ముందుకు రాకూడదు. మాటలనుఅదుపులో ఉంచుకోవాలి. కొన్ని ప్రదేశాల్లో మాటల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు భారీగా నష్టాలను చూడొచ్చు. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. మానసిక ఒత్తిడి వల్ల కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. పిల్లల వివాహానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరడానికి ముందుకు వస్తారు. వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశివారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుటారు. ఇవి భవిష్యత్ లో లాభాలను తీసుకొస్తాయి. సాయంత్రం సమయం తల్లిదండ్రులకు కేటాయిస్తారు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త స్నేహాలు ప్రారంభం అవుతాయి. ప్రియమైన వారి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఆందోళనతో ఉంటారు.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. రోజూవారీ ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం వల్ల కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. సోదరుడి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబ సభ్యులోత కలిసి ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరడానికి ప్రయత్నిస్తారు. రిస్క్ తో కూడిన పనులు చేసేందుకు ముందుకు వస్తారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే సామరస్యంగా ఉండాలి. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.