Pawan Kalyan and Revanth Reddy : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. రాజకీయ రంగంలో కూడా తనదైన మార్క్ ముద్రను వేసుకునే విధంగా ఆయన పలు రకాల ప్రయత్నమైతే చేస్తున్నాడు…మరి ఇప్పటికి ఆయన ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా మెగాస్టార్ తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోగా కూడా ఆయన పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక మెగా అభిమానులు సైతం ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం అయిన డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే…
ఇక ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ చాలా మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశాడు. మొత్తానికైతే వీళ్ళు ఒకానొక సమయంలో తరచుగా కలుసుకునే వారిని కూడా ఆయన తెలియజేయడం విశేషం…అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న ఫైట్ లో ఆయన వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు.
కాబట్టి పవన్ కళ్యాణ్ ని అందరు ఇష్టపడుతున్నారనే చెప్పాలి. మరి ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా అంటే రేవంత్ రెడ్డికి చాలా ఇష్టమట. దాన్ని తరచుగా రిపీటెడ్ గా చూస్తూ ఉంటానని ఇప్పుడు టీవీలో వచ్చిన కూడా చూడడానికి తను చాలా ఆసక్తి చూపిస్తానని చెప్పడం విశేషం… అయితే ఈ మాటలు ఆయన ఒకానొక సందర్భంలో చెప్పినవి కావడం వల్ల అప్పటి మాటలు ఇప్పుడు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వారు ఎవరు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అతనికి చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఇప్పుడు సినిమా, రాజకీయ రంగాలతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆయన సినిమాలనే కాకుండా ఆయనను కూడా అభిమానించే వ్యక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…