Bigg Boss Telugu 8: చాలా రోజుల నుండి బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో స్వయంగా ఈ నలుగురి కుటుంబాలు గ్రూప్ గేమ్స్ ఆడొద్దు, సొంతంగా ఆడండి అంటూ సలహాలు ఇచ్చి వెళ్లారు. అదే విధంగా పాత కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు వచ్చి ఈ నలుగురు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అంటూ నామినేషన్స్ వేసి వెళ్లిపోయారు. దీంతో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలీదు కానీ, యష్మీ మాత్రం ఇక నుండి నేను సోలోగా ఆడుతాను అంటూ చెప్పుకొచ్చింది. కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, నిన్నటి మెగా చీఫ్ టాస్క్ లో చేతల్లో చేసి చూపించింది యష్మీ. నిఖిల్, పృథ్వీ ఎప్పటి లాగానే గ్రూప్ గేమ్స్ ఆడగా, యష్మీ మాత్రం సోలో గా ఆడి గెలిచి మెగా చీఫ్ కంటెండర్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఈ వారం జరగబోయే మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ ద్వారా ఈ సీజన్ చివరి మెగా చీఫ్ ఎవరో తేలిపోతుంది అని అంటాడు. ఈ టాస్క్ లో పాల్గొనడానికి హౌస్ లో ఉన్న వాళ్లంతా అర్హులే, కానీ వారిలో కేవలం 5 మందికి మాత్రమే మెగా చీఫ్ కంటెండర్స్ గా నిలిచే అవకాశం ఉంది అని చెప్తాడు. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ పేరుతో ఉన్న చొక్కాలను పైన నుండి బిగ్ బాస్ స్టాఫ్ విసురుతారు. వాళ్ళ టీ షర్ట్స్ ని చిరగకుండా కాపాడుకుంటూ, చివర్లో పెట్టిన 5 బొమ్మలకు తొడగాలి. ఏ 5 మంది పేర్లతో ఉన్న టీ షర్ట్స్ అక్కడ తొడగబడి ఉంటాయో, ఆ ఐదుగురు మెగా చీఫ్ కంటెండర్స్ గా నిలుస్తారు. ఈ టాస్క్ లో నిఖిల్ పృథ్వీ టీ షర్ట్ ని సేవ్ చేస్తాడు, అదే విధంగా గౌతమ్ తేజా టీ షర్ట్ ని, అలాగే తేజ గౌతమ్ టీ షర్ట్ ని సేవ్ చేస్తారు. గౌతమ్ టీ షర్ట్ ని కాపాడడం కోసం రోహిణి కూడా పోరాడుతుంది.
కానీ యష్మీ మాత్రం నేను ఎవరి కోసం ఆడను, నా కోసం నేనే ఆడుకుంటాను, నా చేతికి నా టీ షర్ట్ తప్ప, ఎవరిదీ వచ్చినా చింపేస్తాను అని ముందుగానే అందరికీ చెప్తుంది. చెప్పిన మాట ప్రకారం ఆమె ముందుగా ప్రేరణ టీ షర్ట్ రాగా ఆమె టీ షర్ట్ ని చింపేస్తుంది. ఆ తర్వాత పృథ్వీ టీ షర్ట్ ని కూడా చింపేదుకు చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. పృథ్వీ టీ షర్ట్ ని యష్మీ చింపడానికి వచ్చినప్పుడు విష్ణు ప్రియ యష్మీ ని అడ్డుకోవడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం లో యష్మీ అరికాళ్ళు దెబ్బ తింటాయి. ఈ రౌండ్ ముగిసిన తర్వాత విష్ణు ప్రియ సెటైరికల్ గా మాట్లాడడం తో యష్మీ కి కోపం వచ్చి గొడవలు వేసుకుంటుంది. ఇక చివరికి తన టీ షర్ట్ వచ్చినప్పుడు యష్మీ దానిని దక్కించుకోవడానికి చాలా గట్టి ప్రయత్నం చేసింది. చివరికి కాపాడుకొని మెగా చీఫ్ కంటెండర్ అవుతుంది. చూస్తుంటే ఒకప్పటి ఆడపులి యష్మీ మళ్ళీ గేమ్ లోకి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఆడబోతుంది అనేది.