https://oktelugu.com/

Horoscope Today: ఈ ఉద్యోగులకు కలిసి వస్తున్న కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం.. పంట పండినట్లే..

ఈ రాశి ఉద్యోగులకు కొత్త సంవత్సరం కలిసి రానుంది. కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే ఈరోజు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణ ఉంటుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2025 / 08:09 AM IST

    Horoscope Today(9)

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా రవి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి కెరీర్ మారబోతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి ఉద్యోగులకు కొత్త సంవత్సరం కలిసి రానుంది. కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే ఈరోజు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణ ఉంటుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాల కోసం చర్చిస్తారు. సాయంత్రం ఇంటికి అతిధి రావడంతో ఉల్లాసంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా అందుకు తగిన ఖర్చులు ఉంటాయి. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం కాకుండా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడితే ఈరోజు పరిష్కారం అవుతుంది. సోదరులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉన్నతాధికారాల నుంచి ప్రశంసలు పొందుతారు.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారం చేయాలనుకునేవారు కొత్త పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా చిరు వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం ఏర్పడుతుంది. పిల్లల వైపు నుంచి నిరాశమైన వార్తలు ఎదుర్కొంటారు. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. అయితే కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం తల్లిదండ్రులకు సేవ చేస్తారు. చుట్టూ ఏదైనా వివాదం ఏర్పడితే వాటికి దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారులు శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబంలో ఏదైనా విభేదాలు ఏర్పడితే ఈరోజు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కలిసి రానుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఎక్కువ. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొందరు శత్రువులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులకు లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యయం చేయాలి. లేకపోతే నష్టాలు ఉండే అవకాశం. బంధువుల నుంచి దన సహాయం పొందుతారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తన తలెత్తుతాయి. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ఆలోచించాలి. వ్యాపారులకు లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలని చూస్తే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో నష్టపోవచ్చు. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారంలో వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాల పై జాగ్రత్తగా ఉండాలి.