Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 15న ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా ఓ రాశి వారి ఇంటికి అతిథులు రావొచ్చు. మరో రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆందోళనతో ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారు కొన్ని విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి:
ఆర్థిక లావాదేవీల విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. బాధ్యతలను సకాలంలో నెరవేరుస్తారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడుతారు.
మిథునం:
ఈరోజు బావోద్వేగాలతో గడుపుతారు. ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు చేస్తారు. ఆసస్మాత్తుగా ఇంట్లోకి డబ్బు వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
సింహ:
శారీరక సమస్యలు ఉంటాయి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది.
కన్య:
ఆకస్మికంగా డబ్బు వస్తుంది. వ్యక్తిగత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుడి సాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపుతారు.
తుల:
ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. అయితే ఎక్కువగా వాదనలు చేయొద్దు. వ్యాపారులు కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల కోసం సమయం వెచ్చిస్తారు.
వృశ్చికం:
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో ఉత్సాహంగా పనిచేస్తారు. కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు:
ఇంటికి అతిథులు వస్తారు. దీంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగు సమస్యలు పూర్తి చేస్తారు.
మకర:
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత పెట్టుడుల నుంచి ఉపశమనం పొందుతారు. బంధువులను కలుస్తారు. దీంతో ప్రశాంతంగా గడుపుతారు.
కుంభం:
ఆర్థిక విషయాల్లో తొందరపడొద్దు. లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆలోచనలతో పనులు మొదలుపెట్టాలి.
మీనం:
కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. దూర ప్రయాలు చేస్తారు.