Horoscope Today : దిన ఫలాలు (డిసెంబర్ 21, 2024): కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఇక మేష రాశి వారు ఆదాయానికి సంబంధించి ఏ పని చేసినా సరే విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయం సంతృప్తికర స్థాయిలో ఉంటుంది అంటున్నారు పండితులు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి పొందే అవకాశం కూడా ఉంది. ఈ రోజు అన్ని రాశుల వారికి ఎలా ఉందో చూసేద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం కొంచెం కొంచెం పెరుగుతుంది. కానీ తగ్గదు. ఆదాయానికి సంబంధించి ఏ పని చేసినా సరే విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల పరిణామాలు మీ సొంతం. ఉద్యోగం, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆరోగ్యం కూడా మీ సొంతం. సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది. పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో పనిభారం, బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కానీ మంచి గుర్తింపు ఉంటుంది. కొన్ని ఇతర విధానాల నుంచి కూడా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయం సంతృప్తికర ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మీరు ఆనందంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచ నలు, వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీకు ప్రతి చోట గౌరవం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలు లభిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. కొందరు ఏది కూడా ఆలోచించకుండా బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అనేక అవసరాలు తీరిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అవివాహితు లకు విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. అయితే, పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెడతారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు విలువనివ్వడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలని స్తాయి. ఆర్థిక వ్యవహారాల్ని చాలావరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అవడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమయ్యే అవ కాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పిల్ల లకు సంబంధించి శుభవార్తలు వింటారు. శత్రు, రోగ, రుణ సమస్యలు చాలావరకు అదుపులో ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరిగి, విశ్రాంతికి దూరమవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను సకా లంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. మంచి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి, సానుకూలతలు పెరుగుతాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు మంచి ఫలితాలను అందిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధనాదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యో గాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే మీకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అయితే, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందకపోవచ్చు. కొందరు బంధుమిత్రులకు ఆర్థి కంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపో తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, చేతిలో డబ్బు నిలవదు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వారికి సమయం ఉండకుండా పని ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేపడతారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Horoscope today good things will happen to them if they see todays horoscope
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com