Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు శివయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. మరికొన్ని రాశుల వారికి రహస్య శత్రువులు ఇబ్బందులకు గురి చేస్తారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటంది. కోపాన్ని అదుపులో ఉంచకోవాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృషభరాశి:
రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొందరు శత్రువులు మీపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఉన్నత విద్యకు ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.
మిథున రాశి:
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. తండ్రి సాయంతో కొత్త పెట్టుబడులు పెడుతారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు.
కర్కాటక రాశి:
ప్రియమైన వ్యక్తి వ్యాపారులకు సహకరిస్తారు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనారోగ్య కారణాల వల్ల ఆందోళనగా ఉంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇవి లాభిస్తాయి.
సింహా రాశి:
కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తారు. వాటి విషయంలో చాకచక్యంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల్లో ఒకరి నుంచి ధన సాయం అందుతుంది.
కన్యరాశి:
వివాహితులు ఆహ్లదకరమైన వాతావరణంలో గడుపుతారు. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆదాయం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు.
తుల రాశి:
శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయాల్లో ఉద్యోగులకు వేధింపులు ఉంటాయి. చాలాకాలంగా డబ్బు పెండింగ్ లో ఉంటే వెంటనే వాటిని తీర్చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి:
ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సోదరుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడుతారు.
ధనస్సు రాశి:
తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల కెరీర్ పై దృష్టి పెడుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరిదగ్గరనైనా అప్పు తీసుకున్నట్లయితే వెంటనే చెల్లించాలి.
మకర రాశి:
ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇవి సక్సెస్ అవుతాయి. విద్యార్థులు భవిష్యత్ గురించి కొత్త ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు అధికారులతో వాగ్వాదం ఉంటుంది.
కుంభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన సమాచారం ఆందోళన కలిగిస్తుంది.
మీనరాశి:
కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.