Horoscope Today: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారి జీవితాల్లో మంగళవారం మార్పులు ఉండనున్నాయి. ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. అలాగే ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తారు. దీంతో సింహాం, కర్కాటక రాశుల వారు ఆర్థికంగా పుంజుకుంటారు. మరికొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.
మేష రాశి:
వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొందరు కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. ఉద్యోగులు అనుకున్నలక్ష్యాలను చేరుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వృషభ రాశి:
ఖర్చులు బాగా ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో కొన్ని రోజులు సంయమనం పాటించాలి.
మిథున రాశి:
కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో తొందరపాటు చర్యలు వద్దు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకునే క్రమంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి:
విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు సానుకూల వాతావరణం ఉండే అవకాశం.ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
సింహారాశి:
పెండింగ్ లో ఉన్న పనులు మరింత ఆలస్యం అవుతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. కొన్ని రంగాల వారికి అధిక ఆదాయం ఉంటుంది.
కన్య రాశి:
ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేవారు వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. చిన్న విషయాల్లో గొడవలు ఏర్పడితో ఓపిక ఉండాలి.
తుల రాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో శ్రమిస్తారు.
వృశ్చిక రాశి:
వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇతరుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి:
ఈ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. ఉత్సాహంగా గడుపుతారు.
మకర రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులకు శుభఫలితాలు ఉంటాయి.
కుంభరాశి:
వ్యాపారులు బిజీ వాతావరణంలో ఉంటారు. ఉద్యోగులు తోటి వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో ఒప్పందాలు చేసే విషయంలో కేర్ తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.
మీనరాశి:
ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కటుుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఫలితాలు నామమాత్రంగానే ఉంటాయి.