Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 21న ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం. సొంత పనులపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొన్ని పరిచయాలు లాభిస్తాయి. విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
వృషభ రాశి:
కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు పాత తప్పులను తలుచుకొని ఆందోళన చెందవద్దు. వ్యాపారుులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈ రాశివారు రిస్క్ పనులు చేయొద్దు. కార్యాలయాల్లో ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఏదైనా సమస్యలు ఉంటే సీనియర్లను సంప్రదించవచ్చు. కొన్ని సమస్యలపై కుటుంబ సభ్యులతో చర్చించాలి.
సింహ:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు చేసే కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఓ సమస్యలపై ఇతరులతో చర్చిస్తారు.
కన్య:
గతంలో చేసిన తప్పుల నుంచి సమీక్ష చేసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.
తుల:
ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి.సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుస్తారు. పండుగల కారణంగా ఇంట్లో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది.
వృశ్చికం:
ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను నమ్మొద్దు. కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఇదే అనుకూల సమయం. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు ఉండే అవకాశం.
ధనస్సు:
ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు ఉంటాయి.
మకర:
వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఏదైనా పనిని మొదలుపెడితే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులతో ఎక్కువగా సంబంధాలు పెంచుకుంటారు.
కుంభం:
మొదలుపెట్టిన పనులపై శ్రద్ధ వహించాలి. కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేయడం మంచిది. ఆస్తి సంబంధిత వ్యవహారాలు త్వరగా పరిష్కారం అవుతాయి.
మీనం:
సాంప్రదాయాలపై ఎక్కువగా దృష్టి పెడుతారు. ఆస్తిని కొనాలనుకునేవారికి అనుకూలమైన రోజు. కొన్ని సౌకర్యాలు సమకూరంతో ఆనందంగా ఉంటారు.