Horoscope Today: గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కన్య, కర్కాటక రాశుల వారికి అనుకోని ధన లాభం ఉండనుంది. కొందరు వ్యాపారులకు మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉండనుంది. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చద్దాం..
మేష రాశి:
పాత స్నేహితుల నుంచి ధన సాయం పొందుతారు. వ్యాపారులు జీవిత భాగస్వామి సలహాతో కొత్త పెట్టుబడులు పెడుతారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు హాజరైతే విజయం సాధిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
వృషభరాశి:
వైద్య అవసరం ఏర్పడితే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. కొన్ని కారణాల వల్ల ఖర్చులు పెరుగతాతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. కొందరు ధన సాయం చేయడానికి ముందుకు వస్తారు.
మిథున రాశి:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండొచ్చు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని విభేదాలు ఏర్పడొచ్చు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. పిల్లల చేసిన పనికి మనసు ప్రశాంతంగా మారుతుంది.
కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇష్టంలేని పనుల జోలికి వెళ్లొద్దు. తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల సలహాతో వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడొచ్చు. మానసికంగా ఆందోళనతో ఉంటారు.
కన్యరాశి:
కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులు ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటారు. సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు
తుల రాశి:
కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇతరుల సలహా తప్పకుండా తీసుకోవలి. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
చట్టపరమైన కేసులు ఉంటే ఈరోజు పరిష్కారం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో జీవిత భాగస్వామి మద్దతు అవసరం. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు తోటివారితో మద్దతు ఉంటుంది.
ధనస్సు రాశి:
ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. పెండింగ్ పనులను పూర్తి చేయడాకి సిద్ధం కావాలి. కొన్ని పనులు కష్టంగా ఉన్నా వాటిని పూర్తి చేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి:
పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కోసం ఖర్చులు పెరుగుతాయి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.వ్యాపారులుకొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం. కొన్ని పనులు పూర్తి చేయడానికి స్నేహితుల సలహా తీసుకుంటారు.
మీనరాశి:
పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఇతరులకు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. రోజూవారీ ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాక ఉంటుంది.