Home : పెంపుడు జంతువులు అంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది ఇంట్లో ఇవి కనిపిస్తుంటాయి. పిల్లులు, కుక్కలను లైక్ చేసే వారు ఎక్కువగా ఉంటారు. కొందరు కుందేలు, రామచిలుక, పావురాలను కూడా పెంచుకుంటారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి పాములను, పందులను కూడా పెంచుకుంటున్నారు. అయ్యో మన దగ్గర చాలా తక్కువండి కానీ అడవిలో ఉండే చాలా జంతువులును కొందరు పెంచుకుంటున్నారు. ఇలాంటి వాటిని చూస్తే మాత్రం కచ్చితంగా భయం వేస్తుంది. వారికి మాత్రం కామన్. అయితే అన్ని జంతువులను పెంచుకుంటాం అంటే మాత్రం అధికారులు ఒప్పుకోరు. కొన్ని జంతువులను పెంచుకోకుండా నిషేధం విధించారు అధికారులు. ఇంతకీ ఏ జంతువులను పెంచుకోకుండా నిషేధం విధించారో తెలుసా? అయితే ఓ సారి చూసేయండి.
వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ప్రకారం పులులను పెంచుకోవడం నిషేధం. పరిరక్షణ ప్రయత్నాలు, భద్రతా కారణాల దృష్ట్యా వాటిని పెంపుడు జంతువులుగా చట్టవిరుద్ధం చేశారు. వీటిని ఇంట్లో పెంచుకోవాలని అనిపిస్తే కూడా మీరు ఆ కోరికను లైట్ తీసుకోవడం బెటర్. కొన్ని సంస్కృతులలో కృష్ణజింకలను గౌరవంగా చూస్తారు. వారికి అవి గౌరవప్రదం. ఇక ఈ కృష్ణ జింకలను పెంచుకోవడం నిషేధం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా వీటిని రక్షిస్తున్నారు. పెంపుడు జంతువులుగా వాటిని సొంతం చేసుకోవడం చట్టం ద్వారా నిషేధం.
ఏనుగులు తరచుగా సాంస్కృతిక ఆచారాలలో ఉపయోగించబడుతున్నప్పటికీ, వాటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా రక్షిస్తున్నారు. అయితే ప్రైవేట్ యాజమాన్యానికి కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా అవసరం. ఇవి మాత్రమే కాదు నక్షత్ర తాబేళ్లను కూడా పెంచుకోవడం నిషేధమే. వన్యప్రాణుల రక్షణ చట్టం క్రింద వీటిని కూడా రక్షిస్తున్నారు. వీటి జనాభాను రక్షించడానికి వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం లేదా వ్యాపారం చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు.
హిమాలయ ప్రాంతానికి చెందిన ఎర్ర పాండాలు అంతరించిపోతున్నాయి. వాటి రక్షిత స్థితి, పర్యావరణ ప్రాముఖ్యత కారణంగా వాటిని పెంపుడు జంతువులుగా కలిగి ఉండటం చట్టవిరుద్ధం చేశారు ప్రభుత్వం. పులుల వలె, సింహాలు అంతరించిపోతున్నాయి. అందుకే వీటిని కూడా భారతీయ చట్టం ద్వారా రక్షిస్తున్నారు. వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం చట్టవిరుద్ధం. ఒకవేళ పెంచినా సరే కచ్చితంగా ప్రమాదకరం. అత్యంత అక్రమ రవాణా జరిగే జంతువులలో ఒకటిగా పాంగోలిన్ లు ఉన్నాయి. అందుకే అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడానికి, జాతులను సంరక్షించడానికి భారతీయ చట్టం ప్రకారం వీటిని రక్షిస్తున్నారు.
ఒరంగుటాన్లు వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం రక్షిస్తున్నారు. పెంపుడు జంతువులను దిగుమతి చేసుకోవడం, వ్యాపారం చేయడం లేదా వాటిని ఉంచుకోవడం నిషేధించారు. చిరుతపులులు భారతదేశంలో రక్షిత జాతి, వాటిని స్వంతం చేసుకోవడం, వ్యాపారం చేయడం లేదా పెంచుకోవడం వంటివి వన్యప్రాణి చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎలుగుబంట్లు భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం రక్షించబడుతున్నాయి. వాటి పర్యావరణ ప్రాముఖ్యతను కాపాడుకోవడానికి పెంపుడు జంతువులుగా వాటిని స్వాధీనం చేసుకోవడం ఖచ్చితంగా నిషేధం. సో జాగ్రత్త.