Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 10న ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. శనివారం చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి వారికి కొత్త వ్యక్తి పరిచయమై ఆశ్చర్యపరుస్తారు. మరో రాశి వారు ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారంలో కొత్త మార్పులు వస్తాయి.
వృషభ రాశి:
కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు, ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:
ఉద్యోగులు నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఓ వ్యక్తి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటకం:
కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రియమైన వారితో గొడవలు వచ్చే అవకాశం. ఆన్ లైన్ లో కొనుగోలు చేసేవారికి అధిక ప్రయోజనాలు ఉంటాయి.
సింహ:
కుటుంబ సమస్యలపై దృష్టి పెడుతారు. వివాహప్రయత్నాలు సాగుతాయి. వ్యాపారులకు అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి.
కన్య:
వ్యాపారులు ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇతరులతో వాదనలకు దిగొద్దు.
తుల:
ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి ప్రయోజనాలు. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ప్రణాలిక ప్రకారంగా వ్యాపారాన్ని విస్తరించాలి.
వృశ్చికం:
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉండేవారు చురుగ్గా ఉంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు.
ధనస్సు:
కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. గతంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఎక్కువే. కొన్ని ప్రాజెక్టుల మూలంగా ప్రశంసలు దక్కుతాయి.
మకర:
మకర రాశివారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉండే అవకాశం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. చిరువ్యాపారులు సమస్యలను ఎదుర్కొంటారు.
కుంభం:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు పొందుతారు. మహిళలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనం:
ఇతరులకు సాయంగా ఉంటారు. ఓ సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.