Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాజులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో శని శుక్రుని కలయిక జరగనుంది దీంతో కొన్ని రాశుల వారికి కెరీర్ అద్భుతంగా ఉంటుంది మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి మీసం నుంచి మీరం వరకు మొత్తం రాజుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. వ్యాపారులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. కొన్ని పనులు పూర్తి కావడానికి సమయం పట్టొచ్చు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. దీంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు ప్రమోషన్ పొందే అవకాశం.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండా.లి విలువైన వస్తువులు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. వ్యాపారులు పెద్ద సలహా తీసుకోవడం మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు శుభవార్తలు వింటారు. వ్యాపార సలహాల కోసం పెద్దల వద్దకు వెళ్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు అందుతాయి. కొత్త ఆదాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన నష్టం కలిగే అవకాశం.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీపై అధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతారు. బంధువులలో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఇంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వద్ద డబ్బు పెండింగ్ ఉంటే ఈరోజు వసూలు అవుతుంది. విదేశాల్లో నివసిస్తున్న వారి నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆందోళనతో ఉంటారు. వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉపాధి కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ప్రత్యర్థుల నుంచి ఈ రాశి వారు ప్రశంశాలు పొందే అవకాశం ఎక్కువ. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. సాయంత్రం తల్లి దండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. కొందరితో వాదనలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) ప్రియమైన వారి నుంచి శుభవార్తను వింటారు. ఊహించని ప్రయాణాలు ఉంటాయి. ఎవరికైనా సాయం చేయాలనుకుంటే ధనం చేతిలోకి వస్తుంది. ఏ విషయం అయినా ప్రశాంతంగా ఆలోచించి పూర్తి చేయాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.