Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త పంచాంగం మొదలయ్యాక కొన్ని రాశుల వారి జీవితాలు మారిపోయాయి. క్రోధి నామ సంవత్సరంలో కొందరికి ఏడాదంతా అదృష్టం వరించనుంది. మరికొందరికి మే తరువాత లక్ష్మీ కటాక్షం వరించుంది. అయితే ఏప్రిల్ నెలలో రెండు రాశుల వారికి శుభయోగాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఈనెల 16న అష్టమ తిథి కారణంగా రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం కలగనున్నాయి. దీంతో రెండు రాశుల వారికి అనుకున్న పనులు జరుగుతాయి. ఆ రాశుల వారు ఎవరంటే?
2024 ఏప్రిల్ 16న కన్యారాశి వారికి ఆకస్మిక అదృష్టం వరించనుంది. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై పైచేయి మీదే ఉంటుంది. తక్కువ సమయంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కెరీర్ కోసం వేసుకున్న ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. సమాజంలో కీర్తిప్రతిష్టలు పొందుతాయి.
ఇదే రోజు వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వారికి ఇన్నాళ్లు పడ్డ కష్టాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక పర్యటనలు ఎక్కువగా చేస్తారు. ఫ్యామిలీ జీవితం చక్కగా సాగుతుంది. సంతానం కోసం ఎదురుచూసేవారు శుభవార్త వింటారు. అనుకోని మార్గాల నుంచి డబ్బు అందుతుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది.
తెలుగు నెల ప్రకారం చైత్ర మాసంతో పాటు శ్రీరామనవమి వస్తున్న సందర్భంగా ఈ రాశుల వారికి అదృష్టం వరించే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొన్ని రాశుల వారు ఏప్రిల్ చివరి నాటి వరకు సంతోషంగా గడుపుతారు. ఆ తరువాత మే నెల నుంచి కొందరికి శుభయోగం కలగనుంది.