Vinayaka chavithi 2024 : హిందువులకి ఎంతో ముఖ్యమైన వినాయక చవితి పండుగ వచ్చేసింది. అందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్ని పండుగలకి ముందు వినాయకుని పండుగ జరుపుకుంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సరిగ్గా జరగాలని వినాయకుని పూజ జరుపుకుంటారు. అసలు వినాయక చవితి ప్రారంభం అవుతుంది అంటే.. వాళ్లకి ఆటోమేటిక్ గా భక్తి వచ్చేస్తుంది. ఎక్కడ చుసిన వినాయకుని ఫొటోలు కనిపిస్తాయి. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్నారు. దీంతో అందరికీ విషెస్ చేస్తూ.. స్టేటస్, స్టోరీ వంటివి పెట్టాలని అర్ధరాత్రి నుంచే అనుకుంటారు. అయితే చాలా మంది ఇలా పెట్టే స్టేటస్ లేదా స్టోరీ అందరిలా కాకుండా కొత్తగా ఉండాలని అనుకుంటారు. అందరిలా విషెస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. దీని కోసం గూగుల్ ని తెగ వెతికేస్తుంటారు. అయితే మీకు అలాంటి సమస్య రాకుండా ఉండాలని.. ఫెస్టివల్ విషెస్ కొటేషన్స్ మీకోసమే.
*తలపెట్టిన ప్రతి కార్యం ఆ గణపతి ఆశీస్సులతో జరగాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి.. వినాయక చవితి శుభాకాంక్షలు
*అందరి కంటే తల్లిదండ్రులే ముఖ్యమని తెలిసేలా చేసిన బొజ్జ గణపయ్య.. మిమ్మల్ని ఆశీర్వదించును.. వినాయక చతుర్థి శుభాకాంక్షలు
*అన్ని విఘ్నాలు తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ వినాయకుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ.. బొజ్జ గణపయ్య శుభాకాంక్షలు
*మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ..గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
*భక్తి శ్రద్ధలతో నిన్ను కొలిచాం.. గణపయ్య కరుణించాలని కోరుకుంటూ.. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
*జయ విఘ్నేశ్వరా నమో నమో
జగద్రక్షక నమో నమో
జయకర శుభకర సర్వ పరాత్పర
జగదుద్ధార నమో నమో
అందరి ఆశలను ఆశయాలను
నెరవేర్చే శక్తిని ప్రసాదించు దేవా
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
*ఓ లక్ష్మీ గణపతి రావయ్య.. వచ్చి మీ కోరికలు తీర్చాలని కోరుకుంటూ..హ్యాపీ వినాయక చవితి
*ఆ గణపయ్య మీకు సకల శుభాలను కలుగజేయాలని కోరుకుంటూ.. చవితి శుభాకాంక్షలు
*ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని పనులు పూర్తి కావాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
*ధైర్య ఆయురారోగ్యాలు అన్ని సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు.. వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
*లడ్డు అంత తీపిగా మీ జీవితం కూడా ఉండాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు
*ముక్కోటి దేవతలను మొక్కులందువాడివి.. విఘ్నాలను కలిగించకుండా ఈ ఏడాది అనుకున్న పనులు అన్ని పూర్తి అవ్వాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు
*మీ ప్రార్థనలన్నింటినీ ఆ గణపయ్య విని.. మీ కోరికలన్నీ నెరవేర్చాలని..
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
*సర్వ విఘ్న విమర్శితం అయిన విఘ్నేశ్వరుడు సకల సుఖాలు ఇవ్వాలని కోరుతూ..మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
*ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడు.. విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే నీరాజనం ఇదే.. ఓ గణపయ్య మిమ్మల్ని రక్షించాలని కోరుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More