Hanuman Power Story: దేవునిపై భక్తి ఎలా ఉండాలో చెప్పే హనుమంతుడు అంటే చాలామందికి ఇష్టం. ప్రతి మంగళవారం, శనివారం మాత్రమే కాకుండా నిత్యం అంనాస్మరణ చేసేవారు ఎంతోమంది ఉన్నారు. వాల్మీకి ప్రకారం రామాయణంలో కీలక వ్యక్తిగా ఉన్న హనుమంతుడు తాను చేసే ధైర్య సాహసాలను ఇప్పటికీ కొందరు ఆదర్శంగా తీసుకుంటారు. రామునికి ప్రియ భక్తునిగా.. వానర సేనానికి అధిపతిగా ఉన్న హనుమంతుడు అత్యధిక శక్తిని కలిగి ఉంటాడు. అయితే అతనికి ఉన్న ఒక మరచిపోయే గుణం ద్వారా ఆ స్వామి తన బలాన్ని తెలుసుకోలేక పోతాడు. ముఖ్యంగా సీతను వెతికే క్రమంలో హనుమంతుడు నిరాశతో ఉన్న సమయంలో తన బలాన్ని తెలుసుకొని సప్తసముద్రాలు దాటుతాడు. అయితే హనుమంతుడు తన బలాన్ని ఎలా తెలుసుకున్నాడు? ఆయనకు తన గురించి ఎవరు చెప్పారు?
రామాయణం మధుర కావ్యం. ఈ కథ ఎంత విన్నా మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే రామాయణంలో సీత అపహరణం తర్వాత అందరికీ కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో సీతను వెతికేందుకు వెళుతుండగా సుగ్రీవుడు సాయం చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో హనుమంతుడు తన వానరసైన్యంతో సీతను వెతికేందుకు సహాయపడతాడు. రామ లక్ష్మణులతో పాటు వానరసైన్యం సీత గురించి వెతుకుతూ సముద్రం వద్దకు వెళ్తారు. లంకలో సీత ఉందని తెలిసిన రామ సైన్యానికి ఏం చేయాలో తోచదు. సప్త సముద్రాలు ఎలా దాటాలో తెలియదు.
ఈ సమయంలో హనుమంతుడు ఒక్కరే కీలకంగా నిలుస్తారు. అయితే హనుమంతుడు తన శక్తి గురించి ఎప్పటికీ మర్చిపోతూ ఉంటాడు. ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తే అమితమైన శక్తి వస్తుంది. ఇదే సమయంలో జాంబవంతుడు అక్కడికి వచ్చి హనుమంతుడి గురించి వివరిస్తాడు. చిన్నప్పుడే మామిడిపండు అనుకుని సూర్యుడిని మింగే ప్రయత్నం చేశావని హనుమంతుడికి జాంబవంతుడు చెబుతాడు. నీలో అమితమైన శక్తి ఉందని.. నువ్వు ఎంతటి దూరమైనా వెళ్తావని.. నీ అంతర్భాగంలో ఉన్న శక్తితో ఏదైనా చేస్తావని జాంబవంతుడు చెబుతాడు.
Also Read: Big Boss 5 Telugu: బిగ్ బాస్ సిరి కోసం ఆమె లవర్ రాసిన లవ్ లెటర్ చూసారా అందులో ఏముందంటే ?
ఆ తర్వాత హనుమంతుడు రాముడిని స్మరిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఒక విశేషమైన శక్తి అక్కడ ఏర్పడుతుంది. హనుమంతుడు ఒక శక్తిగా మారిన తర్వాత.. వాన సైన్యం హనుమంతుడి గొప్పతనాన్ని గురించి స్మరిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో మరింత శక్తిని కలిగిన హనుమంతుడు సముద్రం దాటే క్రమంలో ఒక్కసారిగా’జైశ్రీరామ్’అంటూ పైకి ఎగురుతాడు. అలా పైకి లేచిన హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన ఆంజనేయస్వామి ఎలాగోలా సీతమ్మను కలుసుకొని.. రాముడు గురించి చెబుతాడు. ఆ తర్వాత రావణాసురుడితో కయ్యం పెట్టుకొని లంక దహనం చేస్తాడు.
ఇలా హనుమంతుడు తన శక్తి గురించి తాను తెలుసుకున్న తర్వాత సముద్రం ఎగిరే ప్రయత్నం చేస్తాడు. ఇలాగే మనుషుల్లో కూడా కొందరు తమ శక్తి గురించి తాము గుర్తించరు. తమ గురించి ఒకరి చెబితే లేదా తమ గురించి తమకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే తప్ప క్యారెక్టర్ గురించి తెలుసుకోలేక పోతారు. అయితే ఎప్పటికప్పుడు ఒక పనిని నిర్వహించడానికి సంసిద్ధతతో ఉంటే దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.