Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 21న కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో ఓ రాశివారు ఆర్థికంగా నష్టపోతారు. మరి కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారులు పెట్టుబడి విషయంలో తొందరపడొద్దు. స్నేహితుల సహకారం ఉంటుంది. మానసిక ఒత్తిడులు ఎదురవుతాయి.
వృషభం:
ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. శారీరక సమస్యలు వచ్చే అవకాశం. ఉాద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:
పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. యంత్రాలు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈరోజు కాస్త ఓపిగ్గా ఉండాలి.
సింహ:
ప్రయాణాలు అనుకూలిస్తాయి. డబ్బు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
కన్య:
ప్రియమైన వారితో గొడవలకు దిగొద్దు. దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పెడుతాయి. ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందుతారు. పోటీ పెరుగుతుంది.
తుల:
కొత్త ఉపాధి పొందుతారు. స్నేహితులతో కలిసి టూర్ ప్లాన్ చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారితో వివాదాలు ఉండొచ్చు. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చికం:
కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారికి శుభప్రదంగా మారుతుంది. మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
ధనస్సు:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం ఆశాజనకంగా ఉండదు. అయినా సంతృప్తికర ఆదాయం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
మకర:
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని విషయాల్లో తొందరపడొద్దు. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. సాయంత్రం శుభప్రదంగా ఉంటుంది. పెట్టబడులు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి మద్దతు పొందుతారు.