Magha Purnima : హిందూ సంప్రదాయంలో మాఘ పూర్ణిమకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ పూర్ణిమ (Poornima) నాడు గంగానదిలో స్నానం చేసి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు పూర్ణిమ నాడు గంగా స్నానం చేసి, వస్తువులను దానం చేస్తే మోక్షం లభిస్తుంది. అయితే ఈ ఏడాది రేపే మాఘ పౌర్ణమిని (Poornima) జరుపుకుంటున్నారు. అయితే ఈ పౌర్ణమి నాడు ఏ వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది? ఏ వస్తువులను దానం చేయకూడదో? తెలియాలంటే ఆర్టికల్ మొత్తం ఒకసారి చదివేయండి.
బెల్లం
మాఘ పూర్ణిమ నాడు బెల్లం దానం చేయడం చాలా మంచిది. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బెల్లం దానం చేయడం వల్ల అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. కెరీర్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. పనులలో ఆటంకాలు లేకుండా సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు.
ఆహారం
పౌర్ణమి రోజున ఆహారాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిజం చెప్పాలంటే అసలు ఆర్థిక సమస్యలే ఉండవు. ఇంట్లో డబ్బు కూడా నిలకడగా ఉంటుంది. చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. పౌర్ణమి రోజున అన్నదానం చేయడం వల్ల ఇంట్లో ధనం ఉంటుంది.
మేకప్ ఐటమ్స్
మేకప్ ఐటమ్స్ పౌర్ణమి రోజున దానం చేయడం ఆయుష్షు పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య బంధం కూడా బలపడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా క్లియర్ అవుతాయని పండితులు అంటున్నారు.
ఇనుము దానం చేయకూడదు
మాఘ పూర్ణిమ రోజున ఇనుప వస్తువులు దానం చేస్తే మహా పాపం. వీటిని దానం చేస్తే శని దేవుడికి కోపం వస్తుంది. దీంతో మీకు సుఖ సంతోషాలు ఉండవని చాలా మంది విశ్వసిస్తారు.
వెండి వస్తువులు
వెండి వస్తువులను దానం చేయడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి వస్తువులను దానం చేయవద్దు. వెండిని చంద్రునితో పోలుస్తారు. అందుకే వెండి వస్తువులను అసలు దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఉప్పు
ఉప్పు దానం చేస్తే ఆనందం పోతుంది. పేదరికం వస్తుందని అంటున్నారు. అలాగే రాహు దోషం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పును అసలు దానం చేయవద్దు. కేవలం పూర్ణిమ రోజు మాత్రమే కాకుండా ఎప్పుడూ కూడా ఉప్పును దానం చేయవద్దు. ఉప్పు అనేది లక్ష్మీదేవితో సమానం. ఉప్పుకు ఎంత విలువ ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.