Pumpkin: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అన్ని శుభాలు జరగాలంటే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి.అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంటికి గుమ్మ ముందు ఒక బూడిది గుమ్మడికాయ కనిపిస్తూ ఉంటుంది. నిన్ను చూసి చాలామంది ఊరికే కట్టారని అనుకుంటారు. కానీ బూడిద ఉమ్మడికాయ ఇంటికి కట్టడం వల్ల నరదృష్టి, ఇతర దుష్టశక్తుల నుంచి కాపాడుకోవచ్చు. ఇంటికి మాత్రమే కాకుండా కొన్ని వ్యాపార సముదాయాల్లో కూడా బూడిది గుమ్మడికాయను కడుతూ ఉంటారు. అయితే బూడిది కుమ్మరికాయను కట్టే క్రమంలో కొందరు తెలియక చాలా తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేయడం వల్ల బూడిది గుమ్మడికాయను ఇంటిముందు కట్టిన ఫలితం ఇవ్వదు. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం..
కొందరు ఇండ్లలో నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు రకరకాల వ్యాధుల బారిన పడతారు. ఇలాంటివారు బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బూడిది గుమ్మడికాయ ఇంటిముందు కట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల ప్రకారం ఏర్పాటు చేసుకుంటేనే అనుకున్న ఫలితాలు ఉంటాయి. లేకుంటే అవి పని చేయవు అని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.
బూడిది గుమ్మడికాయను కట్టాలనుకునే వారు ముందుగా దానిని మార్కెట్ నుంచి తీసుకొచ్చేముందు తొడిమె ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తొడిమె లేకుండా ఉండే గుమ్మడికాయ ఇంటిముందు కట్టిన ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే మార్కెట్ నుంచి గుమ్మడికాయను తీసుకొచ్చే సమయంలో తొడిమే ఉన్న వైపు ఉమ్మడికాయను బోర్లించకూడదు. దానిని పైకి ఉంచి తీసుకొని రావాలి. కొంతమంది ఉత్సాహంతో బూడిది గుమ్మడికాయ పైన ఉండే బూడిదిని శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇలా అసలు చేయొద్దు. బూడిది గుమ్మడికాయపై బూడిది ఉంటేనే అది ఎటువంటి ప్రభావం నుంచైనా తట్టుకునే శక్తి ఉంటుంది. అందువల్ల దానిని శుభ్రం చేయకుండా దానిపై పసుపు కుంకుమ తో స్వస్తిక్ ను ఏర్పాటు చేయాలి.
బూడిది గుమ్మడికాయను చాలా మంది ఉదయం 9 లేదా 10 గంటలకు కడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎంత మాత్రం ఫలితం ఉండదు. సూర్యోదయానికి ముందే బూడిది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అది ఇంట్లోకి వచ్చే దుష్టశక్తుల నుంచి అడ్డుకుంటుంది. ఒకవేళ సూర్యోదయం అయిన తర్వాత కూడా కట్టవచ్చు. కానీ సాధారణ ఫలితం మాత్రమే ఇస్తుంది. సూర్యాస్తమం తర్వాత గుమ్మడికాయను కడితే ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు.
పండుగలు ప్రత్యేక రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా బూడిది గుమ్మడికాయను ఇంటికి కట్టుకోవచ్చు. ప్రతి బుధవారం లేదా శనివారం రోజు లేదా అమావాస్య రోజు గుమ్మడికాయను కట్టుకోవాలి. అయితే ఏ రోజు ఏర్పాటు చేసుకున్న సూర్యోదయానికి ముందే కట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల నరదృష్టి, ఇతర దుష్టశక్తుల నుండి కాపాడుకోవచ్చు.