Richest Temples: దేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఏవో తెలుసా?

భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ వివిధ మతాల వారు తమ దైవాలను కొలుస్తూ ఉంటారు. అయితే అందరికంటే హిందూ మతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో దేశం అంతటా ఆలయాలు వెలిశాయి. కొన్ని పురాతన ఆలయాలు సైతం ఇప్పటికీ ప్రముఖంగా కొనసాగుతున్నాయి. వీటిలో కొన్నింటికి భక్తలు నిత్యం తరలివస్తుంటారు.

Written By: Srinivas, Updated On : November 4, 2024 3:02 pm

Indaia-richest-temple

Follow us on

Richest Temples: భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ వివిధ మతాల వారు తమ దైవాలను కొలుస్తూ ఉంటారు. అయితే అందరికంటే హిందూ మతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో దేశం అంతటా ఆలయాలు వెలిశాయి. కొన్ని పురాతన ఆలయాలు సైతం ఇప్పటికీ ప్రముఖంగా కొనసాగుతున్నాయి. వీటిలో కొన్నింటికి భక్తలు నిత్యం తరలివస్తుంటారు. దీంతో వీటికి రాబడి ఎక్కువగా ఉంటుంది. వస్తు, ధన, బంగారం తదితర రూపంలో భక్తులు ఇచ్చే కానుకలతో ఇవి అత్యంత ధనికమైన ఆలయాలుగా గుర్తింపు పొందాయి. ఇలా దేవాలయాలకు వచ్చిన ఆదాయం లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానంగా మూడు ఖరీదైన ఆలయాల గురించి తెలుసుకుందాం..

భారతదేశంలో చాలా మంది ఆధ్యాత్మిక భావనలో వెళ్తారు. ఈ క్రమంలో వారికి వచ్చే ఆదాయంలో పూజలు, వ్రతాలు, దైవ దర్శనాలకు ఖర్చు చేస్తారు. ప్రతీ కుటుంబం నుంచి దాదాపు ఏడాదికి ఒకసారి పుణ్యక్షేత్రాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఆలయాలు మాత్రమే కాకుండా వాటికి సంబంధం ఉన్న రంగాలకు కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో షిరిడీ ఒకటి. మహారాష్ట్రలోని ముంబయ్ కి 296 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతిరోజూ 25 వేల భక్తులు వస్తారని అంచనా. 1922లో నిర్మించిన ఈ ఆలయానికి 2022లో బంగారంతో సాయిబాబా కూర్చున్న సింహాసనం చేయబడింది. ఈ ఆలయానికి నగదు రూపంలో, ఆన్ లైన్, బంగారం, ఇతర మార్గాల ద్వారా విరివిగా విరాళాల వస్తుంటాయి. ఇలా ఈ ఆయానికి వచ్చిన మొత్తం ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైగానే ఉంది.

కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి కొన్ని సంవత్సరాలుగా కథనాలు వస్తున్నాయి. ఈ ఆలయంలోని నేలమాళిగలో అపార సంపద ఉన్నట్లు గుర్తించారు. అయితే మరో గదిని తెరవడం వల్ల మరింత సంపద వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఆలయానికి ఉన్న సంపదతో పాటు విరాళాల రూపంలో వచ్చే మొత్తం ఆదాయంతో కలిపి రూ.1,20,000 కోట్లు ఉన్నట్లు బయటపడింది. దీంతో ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఆలయంగా గుర్తింపు పొందింది.

దేశంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో నెంబర్ వన్ గా నిలిచింది తిరుమల దేవస్థానం ఆలయం. ఈ ఆలయానికి ప్రతిరోజూ 50 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. 2022లో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. శ్రీవారి వార్షిక హుండీ ఆదాయం రూ.1,400 కోట్లు. ఇందులో నగదుతో పాటు లోహాలు, ఇతర వస్తువులు, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. 10 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంల 16 ఎకాల్లో విస్తరించింది. ఉంది. ఈ ఆలయం ఆదాయం 3 లక్షల కోట్లు ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలు, దేశంలోనే కాకుండా ప్రపంచం నుంచి కూడా ఈ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో నిత్యాన్నదానం చేస్తుంటారు. ఈ అన్నదానం వల్ల ప్రతిరోజూ వేల మందికి ప్రయోజనం కలగనుంది. జీవితంలో ఒక్కసారైనా తిరుపతి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్న వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.