Vinayaka Chavithi 2024: దేవుళ్లందరిలో వినాయకుడి పూజ ప్రత్యేక మైనది. ఎందుకంటే ఏ శుభ కార్యం నిర్వహించినా ముందుగా గణపతి పూజ చేస్తారు. శివుడినైనా దర్శనం చేసుకోవాలంటే ముందుగా వినాయకుడిని కలుసుకోవాలి. అయితే గణనాథుడికి ఉన్న ప్రత్యేకతతో ప్రతీ ఏడాది 10 రోజుల పాటు వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ పది రోజులు రోజుకో కార్యక్రమం చేస్తూ భక్తులు ఆ దేవుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఇతర దేవుళ్ల పూజల్లో పూలు, పండ్లు, పసుపు, కుంకుమ వంటి వాటితో పూజలు చేస్తారు. కానీ వినాయకుడి పూజకు మాత్రం వీటితో పాటు 21 రకాల పత్రాలను సమర్పిస్తారు. ఈ పత్రాలతో పూజలు చేయడం వల్ల వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. అంతేకాకుండా ఇవి ప్రకృతి పరమైనవి అయినందున వీటి వల్ల భక్తులకు కూడా ఆరోగ్యం అని చెబుతున్నారు. అయితే ఆ 21 రకాల పత్రాలు ఏవి? వాటి వివరాల్లోకి వెళితే..
భక్తులతో ప్రకృతి మమేకమై ఉంటుంది. కానీ ఆధునీకీకరణ వల్ల కొందరు పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు కనుమరుగైపోతున్నాయి. ఫలితంగా ప్రజలు కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎల్లప్పుడూ కాకుండా కొన్ని ప్రత్యేక రోజుల్లోనైనా ఆరోగ్య కరమైన చెట్లు, పత్రాలు వాడే విధంగా కొన్ని పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రతి వినాయకుడి పూజలో 21 రకాల పత్రాలను ఉపయోగించాలని పెద్దలు నిర్ణయించారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వినాయకుడికి సమ్పించే 21 పత్రాలో మొదటిది మాచీ పత్రం, బృహతీ పత్రం దీనినే ములక అని కూడా ఉంటారు. అలాగే బిల్వ(మారేడు), దూర్వ (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ(ఉత్తరేణి), తులసి, చూత (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (శంకపుష్పం), దాడిమి (నాిమ్మ), దేవదారు, మరువక (ధవనం), సింధువార (వావిలి), జాజి (జాజిమల్లి), గండకీ పత్రం (కామంచి) షమీ (జమ్మి), అశ్వత్థ( రావి), అర్జున (తెల్ల మద్ది), అర్క (జిల్లేడు) పత్రాలను ఉపయోగించి పూజలు చేస్తారు.
అయితే వీటిలో అన్ని పత్రాలు లభించకపోయినా అందుబాటులో ఉన్న వాటితో వినాయక పూజలు నిర్వహిస్తారు ఈ పత్రాల్లో తులసి, రావి, మామిడి తో పాటు మారేడు పత్రాలు అందుబాటులో ఉంటాయి. అలాగే గరిక కూడా కనిపిస్తుంది. అయితే 21 పత్రాలను ఉపయోగించి పూజలు చేయడం వల్ల శ్వాస కోశ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చర్మ వ్యాధుల నుంచి రక్షణగా ఉండొచ్చు. కొన్ని పత్రాలు సువాసనను వెదజల్లుతాయి. దీంతో మనసు ఉల్లాసంగా మారుతుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారు.
ఈ పత్రాలు ప్రకృతితో సంబంధం ఉంటాయి. ఇవి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంటాయి. ఇవి గణనాథుడికి సమర్పించడం వల్ల ఆ దేవుడు ఎంతో సంతోషిస్తాడని అంటారు. వినాయకుడి పూజలో ఉపయోగించే ఏ వస్తువైనా పవిత్రంగా ఉండాలి. ఈ పత్రాలు స్వచ్ఛమైనవి కావడంతో వీటిని ఉపయోగిస్తారని కొందరు పండితులు చెబుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Do you know about the 21 documents used in vinayaka chavithi 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com