chanakya-niti
Chanakya Niti: మగధ సామ్రాజ్యానికి చెందిన చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పిన చాణక్యుడు కొన్ని విషయాల్లో మాత్రం నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ నియమాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల కుటుంబ సంతోషం కోరుకునేవారు కొన్ని నియమాలకు అనుగుణంగా ఉండడం వల్ల సమాజానికి కూడా మేలు చేసిన వారు అవుతారని చాణక్యుడు చెప్పారు. ఇంతకీ ఏ విషయాల్లో నియమాలు ఉంచాలో తెలుసుకుందాం.
మనసులో సంతోషంగా ఉండడానికి డబ్బు, ఆహారం మాత్రమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరమని చాణక్యుడు చెప్పారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం వల్ల తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా స్వచ్ఛంగా మార్చగలుగుతాడు. అందువల్ల వ్యక్తిగత పరిశుభ్రతలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని చానెక్యుడు చెప్పారు. ఈ నియమాల్లో భాగంగా మూడు పనులు చేసిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని చానక్యుడు చెప్పారు. అలా చేయకపోతే అనారోగ్యానికి గురై సమాజానికి కీడు చేసిన వారవుతారని చాణిక్య నీతి తెలుపుతుంది.
ఎవరైనా సరే దహన సంస్కారాలకు వెళ్లిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో శరీరం అపవిత్రం అవుతుంది. అంతేకాకుండా ఒక మృతదేహం వద్ద ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉంటాయి. ఇవి ఏదో రూపంలో శరీరంలోకి వస్తాయి. వీటిని తొలగించుకునేందుకు దగ్గరలోని నది స్నానం చేయాలి. లేదా ఇంట్లోకి వచ్చేవా ముందు వేడి నీటితో స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలి. దీనిని పురాతన కాలంలో పెద్దలు నియమంగా మార్చారు. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండేందుకు ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలకు వెళ్లిన వారు కచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి అడుగు పెట్టాలి. అప్పుడే కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని చేయకుండా ఉంటారు.
పురుషుడు క్షవరం చేయించుకున్న తర్వాత కచ్చితంగా స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలి. ఎందుకంటే క్షవరం చేయించుకునే సమయంలో ఎన్నో రకాల వెంట్రుకలు శరీరంపై పడతాయి. ఇవి అంత త్వరగా కింద పడలేవు. అయితే క్షవరం పూర్తయిన తర్వాత కూడా శుభ్రం చేసిన టివి శరీరాన్ని అతుక్కునే ఉంటాయి. ఇలా ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా ఇతర ప్రదేశాల్లో పడి ఆ తర్వాత హాని చేసే అవకాశం ఉంది. అందువల్ల క్షవరం చేయించుకున్న వారు ఇంట్లోకి ప్రవేశించే ముందే స్నానం చేయాలి. అలా చేయడం వల్ల పరిశుభ్రంగా మారి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలుగుతారు.
నేటి కాలంలో చాలామంది బాడీ మసాజ్ చేయించుకుంటున్నారు. మరికొందరు ఆయిల్ మసాజ్ కూడా చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే స్నానం చేయాలి. ఇలా చేయకుండా ఉండిపోతే ఆయిల్ తో ఉన్న శరీరంపై ఎన్నో రకాల క్రిములు ఉండిపోతాయి. ఇలాగే ఇంట్లోకి ప్రవేశిస్తే అవి ఇంట్లో ఉన్న వారిపైకి వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి మసాజ్ చేయించుకున్న తర్వాత వెంటనే స్నానం చేయాలి. ఆ తర్వాతనే ఇంట్లోకి ప్రవేశించాలి.