Bhogi: అందరూ ఎంతగానో ఎదురు చూసే సంక్రాంతి(Sankranti) పండుగ రానే వచ్చింది. మకర సంక్రాంతి పండుగ ముందు రోజు అందరూ కూడా భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ(Bhogi) వస్తుంటే.. అందరూ కూడా భోగి పిడకలు చేసి మంటలు వేస్తారు. ఇంటికి ఎంత దూరంలో ఉన్నా కూడా భోగి పండుగ రోజుకి అందరూ కూడా కుటుంబ సభ్యుల(Family Members) దగ్గరకు చేరుకుంటారు. ఇళ్లు అన్ని కూడా పండుగ వాతావరణంతో నిండిపోతాయి. ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది భోగి మంటలు(Bhogi Mantalu) వేస్తారు. ఎంతో సంతోషంగా ఆట, పాటలతో ఎంజాయ్(Enjoy) చేస్తారు. ముఖ్యంగా పిల్లలు అయితే భోగి పిడకలతో ఎంతో సంతోషంగా భోగి మంటలు(Bhogi Mantalu) దగ్గరకు వెళ్తారు. ఇంటిలో ఉన్న పాత వస్తువులు అన్ని కూడా అందులో వేసి భోగి పండుగను జరుపుకుంటారు. అయితే భోగి మంటల్లో కొన్ని రకాలను వేయడం వల్ల కష్టాలు అన్ని కూడా తొలగి పోయి సంతోషంగా, ఐశ్వర్యంతో ఉంటారని పండితులు చెబుతున్నారు. మరి భోగి మంటల్లో వేయాల్సిన ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
సాధారణంగా భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వంటివి వేస్తుంటారు. వీటిని మంటల్లో వేయడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అలాగే గాలి శుద్ధి కావడంతో పాటు సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అన్ని కూడా నశిస్తాయి. వీటిని కాల్చిన తర్వాత వచ్చిన గాలి వల్ల శరీరంలోని నాడులు అన్ని కూడా ఉత్తేజం అవుతాయని నమ్ముతారు. అయితే భోగి మంటల్లో ఎర్రటి వస్త్రంతో తయారు చేసిన ఓ మూటను వేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎర్రటి వస్త్రంలో కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, రెండు గోమతి చక్రాలు వేయాలి. వీటిని గట్టిగా కట్టి.. భోగి మంటల చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత వాటిని మంటల్లో వేస్తే జాతక దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. పాపాలు అన్ని పోయి.. అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఆర్థిక సమస్యలు పోయి.. డబ్బు చేతికి వస్తుందని పండితులు చెబుతున్నారు. భోగి మంటల్లో పిడకలు అన్ని కూడా వేసి వాటి నుంచి వచ్చిన విబూదిని చర్మానికి రాయడం వల్ల కూడా మంచి చర్మ సమస్యలు రావని పండితులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.