Bhogi 2026 Festival Special Story: మూడు రోజుల పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా తెలుగు ఇల్లు వాకిళ్లు సందడిగా మారనున్నాయి. సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు జరుపుకునేది భోగి పండుగ. భోగి పండుగ రోజు సాయంత్రం గ్రామాల వాసులు లేదా ఒక వీధిలో ఉండే వారంతా ఒక చోటికి వచ్చి పాత సామాన్లను అన్ని ఒకచోట చేర్చి మంటలు పెడతారు. ఇలా మంటలు వేయడం వల్ల మన జీవితంలోని పాత విషయాలు తొలగిపోయి కొత్త జీవితానికి ఆరంభం కావాలని కోరుకుంటూ ఈ భోగిమంటల చుట్టూ పాటలు పాడుతూ సరదాగా ఉంటారు. అయితే భోగి పండుగ రోజున చిన్నారులపై భోగి పండుగను పోయడం కూడా ఆచారంగా ఉంది. తమ ఇంట్లో ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకు రకరకాల పండ్లు కలిపి వారి నెత్తిపై పోసి ఆశీర్వదిస్తుంటారు. ఈ భోగి పండ్ల గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఇటీవల చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.
సాధారణంగా భోగి పండుగలో భాగంగా భోగి పళ్ళను సూర్యోదయం తర్వాత ఇల్లును మొత్తం శుభ్రం చేసిన తర్వాత చిన్న పిల్లలను ఒక ప్రత్యేకమైన చోట కూర్చోబెట్టి.. వారిపై భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగిపళ్ళలో రేగు పండ్లు, చెరుకు మొక్కలు, నాణేలు, పప్పు దినుసులు మొత్తం ఐదు రకాలుగా ఉండేలా చూస్తారు. ఇవి చిన్న పిల్లల నెత్తిపై పోయడం వల్ల వాటిలో ఉండే గుణాలు పిల్లలకు రావాలని కోరుకుంటాదు. ఉదాహరణకు రేగి పండ్లు లోపట గుజ్జు రావాలంటే దాని పైన పోరా గట్టిగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా వారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇలా భోగి పండ్లను పోస్తారు.
అయితే భోగి పండ్ల గురించి చాగంటి కోటేశ్వరరావు ఇటీవల ఓ సందేశం ఇచ్చారు. భోగి పండ్లను ఉదయం కంటే సాయంత్రం పోయడమే మంచిదని చెప్పారు. చుట్టుపక్కల వారిని పిలిచి వారి మధ్య భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. భోగి పండ్లు పోయడం వెనక ఒక విశిష్టత ఉందని అన్నారు. చిన్నారులకు ఉన్న భోగి పీడ తొలిగిపోవాలంటే చెరుకుముక్కలు, రేగి పండ్లు, నాణేలు మూడు కలిపి చిన్న పిల్లలు ఒక చోట కూర్చోబెట్టి దిగదుడుపు తీసి ఆ తర్వాత నెత్తిపై పోయాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల వారిలో ఉండే భోగి పీడ తొలగిపోతుందని అన్నారు. భోగి పళ్ళను విష్ణుమూర్తిగా భావిస్తారు. సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కువగా నరదృష్టి ఉంటుంది. ఈ పీడా తొలగి పోవాలంటే భోగిపళ్ళను నెత్తిపై పోస్తారు. అంటే పిల్లల తలపై ఉండే బ్రహ్మరథం పై ఇవి పడడం వల్ల బ్రహ్మ రంద్రాన్ని ప్రేరేపిస్తూ వారిలో ఉత్తేజాన్ని నెలకొల్పుతోందని అంటారు. అలాగే వారిలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోయి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారని భావిస్తారు. ఇక భవిష్యత్తులో వారు జ్ఞానవంతులుగా కావడానికి కూడా ఈ భోగి పండ్లు ఉపకరిస్తాయని చెబుతుంటారు.