Astrology Today: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 13న ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది.బుధవారం చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా ఐదు రాశుల వారికి అధిక ప్రయోజనాలు ఉండనున్నాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు కొత్త వాహనాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు కెరీర్ ను డెవలప్ చేసుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉటాయి.
వృషభ రాశి:
ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాలి. తల్లి దండ్రుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాపారంలో ఒడిదొడుకులను జయిస్తారు.
మిథునం:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎవరైనా మిమ్మల్ని సాయం అడిగితే వెంటనే చేయడానికి ముందుకు వస్తారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
కర్కాటకం:
ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇతరుల పనిపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు.
సింహ:
ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. వైద్య సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యమైన పనులు ఇతరులకు అప్పజెప్పొద్దు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి.
కన్య:
ఓ పెట్టుబడి మీకు అధిక లాభాలను తెస్తుంది. కొందరు వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై ఉన్న అపోహాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
తుల:
కొన్ని ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. భవిష్యత్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
వృశ్చికం:
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు నియంత్రించాలి. వ్యాపార సంబంధిత విషయాల్లో శ్రద్ధ చూపుతారు.
ధనస్సు:
బంధువుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భార్యభర్తల మధ్య గొడవలు ఉండే అవకాశం. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
మకర:
వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులు అనుకున్న పనులు నెరవేరడంలో ఆలస్యం కావొచ్చు. కష్టపడిన వారికి తగిన ఫలితాలు వస్తాయి. ఆన్ లైన్ పెట్టుబడుల వారికి అనుకూల సమయం.
కుంభం:
గత కొంతకాలంగా ఉన్న సమస్యలు నేటితో తొలగిపోతాయి. జీవిత భాగస్వామి మద్దతుతో ఓ పనిని పూర్తి చేస్తారు. సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు.
మీనం:
కుటుంబ సభ్యలతో కొన్ని కీలక విషయాలు చర్చిస్తారు. ఓ విషయం గురించి ఒత్తిడికి లోనవుతారు. ఖర్చులు పెరిగే అవకాశం. దానిని నియంత్రించే ప్రయత్నం చేయాలి.