https://oktelugu.com/

Astrology: శనీశ్వరుడి బాధలు పడుతున్నారా? ఇలా చేస్తే శని అనుగ్రహం పొందుతారు..

శనీశ్వరుడు నవగ్రహాల్లో ఒకరు. ఈ స్వామిని కర్మ ప్రదాత అని కూడా పిలుస్తారు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యడి కుమారుడు అని పురాణాలను బట్టి తెలుస్తోంది. ఈశ్వరుడికి ఇష్టమైన భక్తుడు కూడా శనీశ్వరుడే.

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2024 / 01:33 PM IST

    Shaniswara

    Follow us on

    Astrology: శనీశ్వరుడు అనగానే చాలా మందికి భయం వేస్తుంది.ఒక్కసారి శని పీడ పట్టిందంటే ఏడేళ్ల పాటు ఉంటుందని కొందరు అంటుంటారు. శనీవ్వరుడు చెడు చేస్తే వారి జీవితాల్లో అన్ని కష్టాలే ఉంటాయి. ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడుతాయి. ఈ తరుణంలో చాలా మంది శనీశ్వరుడు అంటే భయపడుతూ ఉంటారు. కానీ శనీశ్వరుడు చెడు చేసే వాళ్లనే పట్టి పీడిస్తాడు. వారు చేసిన తప్పులను ఎత్తి చూపించేందుకు వారిని సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కొన్ని కష్టాలను పెడుతూ ఉంటాడు. అయితే శనీశ్వరుడికి భయపడకుండా ఆ స్వామి వారి అనుగ్రహం పొందితే జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటంది. అయితే శనీశ్వరుడి అనుగ్రహం పొండానికి ఏం చేయాలంటే?

    శనీశ్వరుడు నవగ్రహాల్లో ఒకరు. ఈ స్వామిని కర్మ ప్రదాత అని కూడా పిలుస్తారు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యడి కుమారుడు అని పురాణాలను బట్టి తెలుస్తోంది. ఈశ్వరుడికి ఇష్టమైన భక్తుడు కూడా శనీశ్వరుడే. కొందరి జాతకంలో శనీశ్వరుడు ఉంటాడు. దీంతో వారి జీవితం చిందరవందరగా ఉంటుంది. ఏ పనిచేసినా అడ్డుంకులు ఏర్పడుతాయి. అయితే ఒక వ్యక్తి చేసిన కర్మ ఫలితం కారణాంగానే శనీశ్వరుడు వారి జీవితంలోకి వస్తాడు. అలా వచ్చిన దేవుడు వారిని సక్రమ మార్గంలో ఉంచేందుకే ఇబ్బందులు పెడుతాడు.

    అయితే శనీశ్వరుడి బాధల నుంచి విముక్తి పొందాలంటే ఆ స్వామి అనుగ్రహం పొందాలి. అందుకోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. శనీశ్వరికి మంగళవారం, శనివారం ప్రీతికరమైన రోజులు. శనివారం రోజున శనీశ్వరుడి శరణు కోరుతూ తైలాభిషేకం చేయాలి. నల్ల నువ్వులతో అభిషేకం చేసి, నలుపు దుస్తులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని బాధల నుంచి విముక్తి పొందుతారు.

    అయితే శనీశ్వరుడి బాధ నుంచి విముక్తి పొందాలంటే కొన్ని పొరపాట్లు చేయొద్దు. ప్రతీ శనివారం నువ్వుల నూనె, చెప్పులు ఇంటికి తీసుకు రావొద్దు. అలాగే నవధాన్యాలు, ఉప్పు, కారం మొదలైనవి కొనుగోలు చేయొద్దు. ఈ వస్తువులు ఎవరైనా దానం చేసినా తీసుకోకుండా ఉండాలి. శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకంగా పూజలు చేయకున్నా.. వేసవిలో ఇతరుల దాహార్తిని తీర్చడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటున్నారు. అంతేకాకుండా వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు చెప్పులు, దుస్తులు దానం చేసినా శుభపలితాలు ఉంటాయి.