Marital Problems: హిందూ పురాణాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో దేవుళ్లను కొలవడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రతి మనిషిలో వివాహం చేసుకున్న తర్వాత అనేక గొడవలు, విభేదాలు సాధారణంగా ఉంటాయి. కానీ కొందరిలో ఇవి తారస్థాయికి చేరుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యల పరిష్కారానికి మానవులతో చేయలేనిది.. దైవానుగ్రహం ఉండడం వల్ల సాధ్యమవుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకోసం ఏడాదిలో వచ్చే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేయడం వల్ల సాధ్యమవుతుందని అంటున్నారు. షష్టి మాసంలో వచ్చే స్కంద షష్టి రోజున సుబ్రహ్మణ్యస్వామిని కొనడం వల్ల వివాహంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. అసలు స్కంద షష్టి అంటే ఏమిటి? ఏడాదిలో ఇది ఎప్పుడు వస్తుంది? ఈ రోజున ఏం చేస్తే వివాహ సమస్యలు దూరం అవుతాయి?
2025 నవంబర్ 28న స్కంద షష్టి రాబోతుంది. భగవాన్ కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్యస్వామికి ఈరోజు ప్రత్యేకంగా చెబుతారు. శత్రు నాశనం, అడ్డంకుల తొలగింపు, ధైర్యం, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని కొలవడం వల్ల పరిష్కారం అవుతాయని పురాణాలు తెలుపుతున్నాయి. స్కంద షష్టి రోజున నిష్టతో ఉండే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కేవలం పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి వెళ్లి కుంకుమార్చన, నాగపూజ, శరణాగతి శ్లోకాల పఠనం చేయడం అత్యంత శ్రేయస్కరమని అంటున్నారు. అలాగే సుబ్రహ్మణ్య అష్టోత్తరం లేదా కంద షష్టి కవచం పఠనం కూడా చేయవచ్చు. ఇక సుబ్రహ్మణ్యస్వామికి ఈరోజు పాలాభిషేకం, తినే అభిషేకం, చక్కెర అభిషేకం చేయడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ ఆరు లేదా 12 ప్రదక్షణలు చేయడం శ్రేయస్కార్మని అంటున్నారు.
వివాహ సమస్యలు ఉన్నవారు స్కంద షష్టి ఉన్నవారు ప్రత్యేక పనులు చేయడం వల్ల పరిష్కారం అవుతాయని అంటున్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని ఎరుపు రంగు పువ్వులతో పూజలు చేయాలి. అంటే జాజిపూలు లేదా కనకాంబరాలతో పూజలు చేయడం మంచిది అని అంటున్నారు. అలాగే ఈరోజు ఓం శరవణ భవ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలని అంటున్నారు. ఈ మంత్రం జపించడం వల్ల వివాహం జరగడానికి అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసిన తర్వాత నైవేద్యంగా బెల్లం తో కూడిన లడ్డు లేదా పాలు, చక్కెరను నైవేద్యంగా ఇవ్వాలని అంటున్నారు. అలాగే నాగదేవతకు పూజలు చేయడం వల్ల కుజదోషం, నాగదోషం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఈరోజు కుమారస్వామి ఆలయంలో తీసుకునే తీర్థం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందవచ్చు అని చెబుతున్నారు. మొత్తంగా స్కంద షష్టి రోజున సుబ్రమణ్య ఆశీస్సులు పొందాలంటే ఆ స్వామివారి ఆలయాన్ని దర్శించాలని చెబుతున్నారు.